ASBL Koncept Ambience
facebook whatsapp X

YSRCP : మండలిపైనా వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా..?

YSRCP : మండలిపైనా వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2019లో 151 సీట్లతో అధికారంలో దక్కించుకున్న ఆ పార్టీ తాజా ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి ఎదురైనా శాసన మండలిలో మాత్రం ఇప్పటికీ ఆ పార్టీదే పెత్తనం. అందుకే అధికార ఎన్డీయే కూటమికి శాసన మండలిలో చెక్ పెట్టవచ్చని భావించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. అయితే ఇటీవలి పరిణామాలు శాసన మండలిలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా కలిసి రావట్లేదని సూచిస్తున్నాయి.

2019-24 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మొదట్లో శాసన మండలిలో టీడీపీకి ఎక్కువ మంది సభ్యులుండేవాళ్లు. దీంతో జగన్ కు మండలిలో ఆటంకాలు ఎదురయ్యేయి. దీన్ని సహించలేని జగన్ ఒకానొక సమయంలో శాసన మండలినే రద్దు చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. గడువు ముగిసే సమయానికి వైసీపీకి బలం పెరిగింది. ఆ పార్టీకి మొత్తం 37 మంది ఎమ్మెల్యేలు పోగయ్యారు. ప్రతిపక్ష టీడీపీకి 10 మంది సభ్యులు ఉండే వాళ్లు. ఇప్పుడు ఆ బలమే వైసీపీకి పెద్ద ప్లస్ గా మారింది. మండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చని భావించింది.

అయితే ఇటీవలికాలంలో పలువురు ఎమ్మెల్సీలు వైసీపీకి వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎన్నికల ముందే ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, సి.రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందే వైసీపీని వీడిపోయారు. ఎన్నికల తర్వాత నలుగురు సభ్యులు గుడ్ బై చెప్పేశారు. కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ రాజీనామా లేఖలను సమర్పించారు. వీటిని శాసన మండలి ఛైర్మన్ ఆమోదించాల్సి ఉంది. తమ రాజీనామాలను ఆమోదించాలని ఇటీవల వీళ్లంతా నిరసన కూడా తెలియజేశారు. మరోవైపు ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా అనర్హత నుంచి తప్పించుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు మరోసారి తన వ్యవహారం శాసన మండలి ఛైర్మన్ వద్దకు చేరింది.

మొత్తంగా 8 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. అంటే వైసీపీ బలం 29కి పడిపోయింది. రాజీనామా చేసిన వాళ్ల స్థానాల్లో కచ్చితంగా కూటమి సభ్యులే గెలుస్తారు. అప్పుడు కూటమి బలం 18కి పెరుగుతుంది. త్వరలో మరికొంతమంది సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జఖియాఖానం ఇప్పటికే టీడీపీతో ట్రావెల్ చేస్తున్నారు. పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ బలం 26కు పడిపోయి కూటమి బలం 21కి చేరుతుంది.. మరో ఐదుగురు వైసీపీని వీడితో మండలిలో కూడా కూటమిదే ఆధిపత్యం. త్వరలోనే శాసన మండలిని కూడా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఎన్డీయే కూటమి. అదే జరిగితే జగన్ మండలి ఆశలపై నీళ్లు చల్లినట్లే.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :