ASBL Koncept Ambience
facebook whatsapp X

సిరిసిల్లలో జీ తెలుగు తారల సందడి 'సీతారాముల నిండు నూరేళ్ల సావాసం'

సిరిసిల్లలో జీ తెలుగు తారల సందడి 'సీతారాముల నిండు నూరేళ్ల సావాసం'

నిరంతరం ఆకట్టుకునే సీరియల్స్​, ఆసక్తికరమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్​ జీ తెలుగు. ప్రత్యేక కార్యక్రమాలతో మరింత వినోదం పంచుతున్న జీ తెలుగు తాజాగా సిరిసిల్ల వేదికగా అభిమానులకు అద్భుత అవకాశాన్ని అందించింది. విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న జీ తెలుగు సీరియల్స్​ సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులతోపాటు ఇతర తారలు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ పేరున  ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమం ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ నవంబర్​ 3న మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!

జీ తెలుగు ఇటీవల సిరిసిల్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది. ప్రముఖ యాంకర్​ లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది. జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న'సీతే రాముడి కట్నం', 'నిండు నూరేళ్ల సావాసం'నటీనటులు ఈ వేదికపై నుంచి తమఅభిమానులతో సంభాషించడమే కాకుండా పలు బహుమతులను కూడా పంచి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.సీతేరాముడికట్నంజోడీసీత (వైష్ణవి)-రామ్ (సమీర్),&మహాలక్ష్మి(మంజులపరిటాల)నిండు నూరేళ్ల సావాసం అమరేంద్ర (రిచర్డ్జోస్)-అరుంధతి (పల్లవిగౌడ), అమరేంద్ర (రిచర్డ్జోస్)-భాగమతి (నిసర్గ)తెరమీదనే కాదు తెర వెనక కూడా తమ మధ్య అనుబంధం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించి వినోదం పంచారు.

జీ తెలుగు తారల సందడితో ఉత్సాహవంతంగా సాగిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులతో పాటు జానపద గాయకుల పాటలు, డ్రామా జూనియర్స్​ పిల్లల స్కిట్స్​ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రెండు సీరియల్స్​పై వచ్చిన సరదా మీమ్స్​ ప్రదర్శిస్తూ సాగిన కామెంటరీ అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ‘అసలైన అమరేంద్ర ఎవరు?’ అంటూ సాగిన డ్రామా జూనియర్స్​ స్కిట్ ఆసక్తికరంగా సాగింది. జీ తెలుగు నటీనటులు తమ అభిమానులతో సెల్ఫీలు దిగడం, బహుమతులతో సర్ ప్రైజ్ చేయడంతోపాటు వారిని పలకరించి ముచ్చటించారు. నటీనటులు చెరగని అనుభూతులు పంచారు. ఘనంగా జరిగిన ఈ సరదా సంబరాన్ని జీ తెలుగు వేదికగా మీరూ మిస్​ కాకుండా చూసేయండి!

మన సిరిసిల్లలో జీ తెలుగు తారల సందడి.. 'సీతారాముల నిండు నూరేళ్ల సావాసం', ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు.. మీరూ తప్పకుండా చూడండి!

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :