ASBL Koncept Ambience
facebook whatsapp X

అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (55th IFFI, GOA) లో ప్రదర్శించనున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’

అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం (55th IFFI, GOA) లో ప్రదర్శించనున్న ‘వికటకవి’, ‘డిస్పాచ్’

అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ZEE5 ఒరిజినల్ సీరిస్‌లైన డిస్పాచ్, వికటకవి స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు. మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన వికటకవిని నవంబర్ 23న ప్రదర్శించనున్నారు. 

కను బెహ్ల్ దర్శకత్వంలో వచ్చిన డిస్పాచ్ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత అగర్వాల్ ముఖ్య పాత్రలను పోషించారు. మనోజ్ బాజ్‌పేయి అనుభవజ్ఞుడైన క్రైమ్ జర్నలిస్ట్ పాత్ర (జాయ్)ను పోషించారు.  అధికారం, నైతికత మరియు వ్యక్తిగత సంఘర్షణల వలయంలో చిక్కుకున్న జాయ్ ప్రయాణంగా ఈ కథ ఉంటుంది. 

https://x.com/ZEE5Global/status/1858407097026679220 

వికటకవి : ది క్రానికల్స్ ఆఫ్ అమరగిరి అనేది ఒక రహస్య ప్రదేశమైన అమరగిరి నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ డిటెక్టివ్ థ్రిల్లర్. ఇక్కడ రామకృష్ణ అనే యువ పరిశోధకుడు ఈ ప్రాంతాన్ని సంబంధించిన ఒక రహస్యమైన కేసులో చిక్కుకుంటాడు. నల్లమల్ల అడవిలోకి ప్రవేశించిన తర్వాత గ్రామస్థులు రహస్యంగా తమ జ్ఞాపకాలను కోల్పోతుంటారు. రామకృష్ణ ఇంకా లోతుగా పరిశోధించినప్పుడు కొన్ని రహస్యాలు బయటపడతాయి. 1970ల నాటి తెలంగాణ నేపథ్యంతో రూపొందించబడిన ఈ తెలుగు ఒరిజినల్ సిరీస్ నాటి సాంస్కృతిక, ఆచార, సంప్రదాయాలను చాటి చెబుతుంది. 

https://x.com/ZEE5Telugu/status/1858449443781222738 

55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమం నవంబర్ 20 నుండి 28వ తేదీ వరకు గోవాలో జరుగనుంది. ఈ క్రమంలో వికటకవి వెబ్ సిరీస్‌ను అక్కడ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా డిస్పాచ్ డైరెక్టర్ కను బెహ్ల్ మాట్లాడుతూ.. ‘మా సిరీస్‌ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంత గొప్ప అనుభూతి మరొకటి లేదు. నేను మొదటిసారి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొంటున్నాను. చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు. 

https://www.instagram.com/p/DCbd_ApORzr 

వికటకవి దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ..‘ఐఎఫ్‌ఎఫ్‌ఐలో విక్కతకవి ప్రీమియర్‌ను ప్రదర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రతిష్టాత్మక వేదికపై ఏ దర్శకుడికైనా తమ పనితనాన్ని ప్రదర్శించడం నిజంగా గొప్ప గౌరవం. వికటకవిలో సాంస్కృతిక మూలాలు, గ్రిప్పింగ్ మిస్టరీ ఉంటుంది. ప్రత్యేకించి అది తెలుస్తుంది తెలంగాణలోని స్థానిక చరిత్రను ప్రపంచ ప్రేక్షకులకు అందిస్తుంది. రైట‌ర్ సాయితేజ దేశ్‌రాజ్‌గారు మంచి క‌థ‌ను అందించారు. ZEE5తో ఈ సహకారంతో ఈ సిరీస్‌ను అద్భుతంగా తీశాం. ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ని IFFIని ప్రదర్శించాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. 

ZEE5 గురించి... 

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :