ASBL Koncept Ambience
facebook whatsapp X

కమలా హారిస్‌ సరికొత్త రికార్డ్‌ ...జూమ్‌ కాల్‌ చరిత్రలోనే

కమలా హారిస్‌ సరికొత్త రికార్డ్‌ ...జూమ్‌ కాల్‌ చరిత్రలోనే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరపున అభ్యర్థిగా భారత సంతతి అమెరికన్‌ కమలా హారిస్‌ పోటీ దాదాపు ఖరారైనట్లే. ఈ క్రమంలో ఆమెకు ప్రజల నుంచి విసృతస్థాయిలో మద్దతు లభిస్తోంది. హారిస్‌ కోసం నిర్వహించిన ఓ జూమ్‌ కాల్‌లో మహిళలు రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 90 నిమిషాల కంటే తక్కువ సమయంలో జరిగిన ఈ కాల్‌లోనే ఆమెకు 2 మిలియన్‌ డాలర్ల ( భారత కరెన్సీలో దాదాపు రూ.16 కోట్లుకు పైమాటే)కు పైగా విరాళాలు అందడం విశేషం. కమలాహారిస్‌కు మద్దతుగా వైట్‌ విమెన్‌ ఆన్సర్‌ ది కాల్‌ పేరుతో జూమ్‌ వేదికగా ఈ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ కాల్‌లో ఏకంగా 1.64 లక్షల మంది పాల్గొన్నారు. ఇందులో సామాన్య మహిళలతో పాటు ప్రముఖ సింగర్‌ పింక్‌ (అలిసియా మూరె), నటి కాన్ని బ్రిటన్‌, కమెడియన్‌ కరోల్‌ లీఫ్‌ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. పాప్‌ స్టార్‌ పింక్‌ తన విమానం నుంచి ఈ కాల్‌కు హాజరయ్యారు. తొలుత కమెడియన్‌ కరోల్‌ లీఫ్‌ 5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించంగా, ఆ వెంటనే విరాళాలు పోట్తెతాయి. జూమ్‌ కాల్‌ చరిత్రలోనే అతిపెద్ద గ్రూప్‌ కాల్‌ ఇదే కావడం విశేషం.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :