ASBL Koncept Ambience

ముందుకొస్తున్న కొత్త తరం.. అభినందించాలి మనందరం..

ముందుకొస్తున్న కొత్త తరం..  అభినందించాలి మనందరం..

గత 20 ఏళ్లుగా  అమెరికా లో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఇప్పుడు అతి పెద్ద భారత సంతతి అంటే తెలుగు వారే నని అందరికీ తెలిసిన విషయమే. పెరుగుతున్న కమ్యూనిటీ తో పాటు ఉత్సాహవంతులు, నాయకత్వం కోసం ముందుకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. అలాగే తెలుగు సంఘాల సంఖ్య కూడా పెరగటం సహజమే కదా! తెలుగు సంఘాలు చీలి పోతున్నాయి, విడి పోతున్నాయి అని భాధ పడేవారు వున్నా, పెరుగుతున్న కమ్యూనిటీకి సంఘాలు పెరగటం అవసరమే అని చెప్పే వారు వున్నారు. ప్రతి పట్టణంలోనూ గుళ్ళు వస్తున్నాయి, రెస్టారెంట్స్‌ వస్తున్నాయి.. సంఘాలు కూడా వస్తున్నాయి..

తప్పేముంది అని సర్ది చెప్పే వారు కూడా బానే వున్నారు. ఏమైతేనేం.... కమ్యూనిటీ పెరుగుతోంది... కమ్యూనిటీకి కావలసిన అవసరాలు తీర్చేందుకు కొత్త కొత్త ఆర్గనైజేషన్లు వస్తున్నాయి. కొత్త  నాయకులు, కొత్త కొత్త ఈవెంట్లు వస్తున్నాయి.

ప్రతి సంఘానికి, లేదా సంస్థకి వాటి నాయకులకు కమ్యూనిటీకి కావలసిన లేదా నచ్చే కార్యక్రమాలు రూపొందించటం, వాటిని నిర్వహిం చడం ఒక ఎత్తు అయితే... ఆ కార్యక్రమాలకు కావలసిన నిధులను సమకూర్చుకోవడం ఇంకొక ఎత్తు అని చెప్పాలి. ప్రతి వూరిలో వుండే డాక్టర్లు, పెద్ద ఉద్యోగస్తులు దగ్గర విరాళాలు తీసుకొనేవారు.. మెల్లమెల్లగా మన వాళ్ళు పెట్టిన ఐటీ సంస్థలు, రెస్టారెంట్లు రావటం, వాటి యజమానులు ముందుకు వచ్చి ప్రోగ్రాంలను సపోర్ట్‌ చెయ్యడం ప్రారంభించారు.

4-5 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్ర మాలు, సేవా కార్యక్రమాలు నిశితంగా పరిశీలిస్తే... తెలుగు సంఘాలు, సంస్థలు పోటా పోటీగా సేవా కార్యక్రమాలు చెయ్యడం ఎంత నిజమో... వాటికి అండదండలు అందిస్తున్న వ్యక్తులు ప్రతి చోటా పెరగటం కూడా అంతే నిజం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కోవిడ్‌ సంక్షోభం సమయంలో ఎన్‌ఆర్‌ఐ లు విడి విడిగా లేదా ఒక గ్రూప్‌గా లేదా ఒక సంస్థ / సంఘం తరుపున ఇటు అమెరికాలోనూ, అటు మాతృ రాష్ట్రాలలోనూ చేసిన సేవలను ఎవరు మర్చి పోలేరు. ఇంతమంది దాతలు వున్నారా... ఇంత దయా గుణం వున్నదా అని ఆశ్చర్యపోయిన సందర్భాలు వున్నాయి.

17వ ఆటా సభల నిర్వహణలో కొత్త తరం

అందరికీ తెలిసిన సంగతులే అయినా, ఇలా ఒక విశ్లేషణలో రాస్తునందుకు, కొందరి పేర్లు ఎవఅ్‌ఱశీఅ చేస్తున్నందుకు, ఆటా నాయకులను, ఆయా వ్యక్తులను మన్నించమని కోరుతున్నాను. జాతీయ సంఘాలకు నాయకత్వం వహించటం అంటే మామూలు విషయం కాదు. 30 ఏళ్ల పైబడ్డ, ఓ 30,000కి పైగా సభులు వున్న సంఘంకి అధ్యక్షుడు గా నాయకత్వం స్వీకరించటం పెద్ద సవాలే.. ప్రతి అధ్యక్షుడు తన పీరియడ్‌లో ఎన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేయాలి అన్న ప్రణాళికతో పాటు, కాన్ఫరెన్స్‌ ఎక్కడ, ఎలా చేయాలి అని ఒక నిర్దిష్టమైన ఆలోచన తో వస్తారు. ముందుగా సంస్థలోని బోర్డు మేంబర్లని, లేదా ఎక్జిక్యూటివ్‌ బాడీ సహకారంతో తన ఆలోచనలకు ఒక రూపం తెచ్చి కార్యాచరణ చేస్తారు.

ఆటా అధ్యక్షులు శ్రీ భువనేశ్‌ బూజల కూడా ఒక మెగా కన్వెన్షన్‌ చెయ్యాలి అనే దృడ నిశ్చయంతో వాషింగ్టన్‌ డీసీలో కాన్ఫరెన్స్‌ చెయ్యాలి అని, ఔaశ్ర్‌ీవతీ షశీఅఙవఅ్‌ఱశీఅ షవఅ్‌వతీలో చేయాలి అన్న నిర్ణయం తీసుకొని పనులు మొదలెట్టారు. వాషింగ్టన్‌ డీసీ అవటం, ఇండిపెండెన్స్‌ వీక్‌ ఎండ్‌ అవటంతో కన్వెన్షన్‌ సెంటర్‌ ఖర్చులు భారీగా వుంటాయని అందరికీ తెలిసిన విషయమే.. అంతే కాకుండా ఇండియాలో అమెరికన్‌ కన్సులేట్‌ ఆఫీస్‌ రెండు సంవత్సరాల కోవిడ్‌ వలన వీసా ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం, అందువలన ఇండియా నుంచి వచ్చే స్పాన్సర్లు రాలేక పోవటం ఒక పెద్ద దెబ్బే..

ఓ 10 ఏళ్ల క్రితం దాతలు అంటే దేశం మొత్తం మీద ఓ ప్రేమ్‌ రెడ్డి గారు, ఓ మల్లా రెడ్డి గారు, ఓ హనిమి రెడ్డి గారు, ఓ జయరామ్‌ కోమటి గారు, ఓ కృష్ణ ప్రసాద్‌ కాట్రగడ్డ గారు, ఓ  హేమ ప్రసాద్‌ యార్లగడ్డ గారు అంటూ కొద్ది మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు విరాళం ఇచ్చి కాన్ఫరెన్స్‌లు జరపటానికి చేయూత ఇచ్చేవారు.. ఇపుడు కూడా ఇస్తున్నారు కూడా.. అయితే ఆటా నాయకత్వ పటిమ కావచ్చు, శ్రీ భువనేష్‌ టీమ్‌ పెట్టిన శ్రమ కావచ్చు.. దాదాపు 5000 మంది దాతలు ముందుకు వచ్చి ఆటా సభలకు అండగా నిలిచారు. వారి అందరినీ పేరు పేరునా అభినందించాలి.

అలాగే  12,000 పైగా వచ్చే ఈ తెలుగు  కన్వెన్షన్‌ని ఒక పెద్ద ఈవెంట్‌ గా గుర్తించి, అలాంటి టార్గెట్‌ గ్రూప్‌కి తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకొనే సాధనంగా గుర్తించి అనేక అమెరికాలోని సర్వీస్‌ కంపెనీలు రావటం విశేషం. Four Oaks Insurance Group ఈ కన్వెన్షన్‌కి మెగా గ్రాండ్‌ స్పాన్సర్స్‌గా వచ్చి స్పాన్సర్షిప్‌ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభించిన శ్రీ రఘు సుంకికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. అలాగే స్పాన్సర్స్‌గా వచ్చిన ఐటీ కంపెనీలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, లా కంపెనీలు కూడా ఈ సభలను ఒక తమ కంపెనీల బిజినెస్‌ ప్రమోషన్‌కి వేదికగా గుర్తించటం అభినందనీయం. ఈ కంపెనీల యాజమాన్యాలు తెలుగు వారు లేదా తెలుగు వారితో బిజినెస్‌ చేస్తున్న వారే అవటం వలన ఇది సాధ్యం అయ్యింది.

ఈ విధంగాగా కొత్త తరం వారు డోనార్స్‌గా రావటం, స్పాన్సర్స్‌గా రావటం ఒక మంచి పరిణామం. వారికి జేజేలు చెపుతూ, వారిని ముందుకు తీసుకు వచ్చిన ఆటా నాయకత్వానికి, అధ్యక్షులు శ్రీ భువనేశ్‌ బూజలకి అభినందనలు చేపుదాం.

12,000 పైగా వచ్చే ఈ తెలుగు  కన్వెన్షన్‌ని ఒక పెద్ద ఈవెంట్‌గా గుర్తించి, అలాంటి టార్గెట్‌ గ్రూప్‌కి తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసుకొనే సాధనంగా గుర్తించి అనేక అమెరికాలోని సర్వీస్‌ కంపెనీలు రావటం విశేషం. ఖీశీబతీ ూaసం Iఅంబతీaఅషవ స్త్రతీశీబజూ ఈ కన్వెన్షన్‌కి మెగా గ్రాండ్‌ స్పాన్సర్స్‌గా వచ్చి స్పాన్సర్షిప్‌ చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభించిన శ్రీ రఘు సుంకికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి.

 

Tags :