పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్
అమెరికాలోని న్యూయార్క్లో రెండు పెంపుడు పిల్లులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు ధ్రువీకరించారు. అమెరికాలో పెంపుడు జంతువులకు కరోనా సోకిన తొలి కేసు ఇదేనని సృష్టం చేశారు. కొవిడ్ 19తో బాధపడుతున్న పరిసర ప్రాంత ప్రజల నుంచి ఈ వైరస్ పిల్లులకు సోకినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజీ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ సంస్థ తెలిపింది. మనుషుల నుంచి ఈ వైరస్ జంతువులకు సోకుతుందని, కానీ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లు ఎక్కడా ఆధారాలు లభించలేదని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన ఈ పిల్లులు ప్రస్తుతం శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాయి.
Tags :