తానా మహాసభల ఏర్పాట్లు ముమ్మరం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సెయింట్‌లూయిస్‌లో నిర్వహించనున్న 21వ తానా మహాసభలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెయింట్‌లూయిస్‌లో మహాసభల వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమనతోపాటు, మహాసభల కన్వీనర్ చదలవాడ కూర్మనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా 40వ వార్షికోత్సవ కేక్‌ను కూడా కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహాసభల కమిటీల చైర్‌పర్సన్‌లను ఉద్దేశించి జంపాల చౌదరి, సతీష్ వేమన, కూర్మనాథ్ ప్రసంగించారు. మహాసభలను విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలని వారు కోరారు.
Tags :