జూలై 4 నుంచి తానా మహాసభలు : సతీశ్ వేమన
పన్నెండేళ్ల తర్వాత అమెరికాలోని వాషింగ్టన్ డీసీ మహానగరంలో జూలై 4, 5, 6 తేదీల్లో తానా 22వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సతీశ్ వేమన తెలిపారు. ఈ సభలు దిగ్విజయం కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం ప్రారంభ సమయంలో దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తానా మహాసభలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌లను ఆహ్వానించినట్లు తెలిపారు. తొలిసారిగా తానాసభల వేదికపై టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. తాళ్లపాకలో 600 మంది కళాకారులతో జరిపిన ఎప్పటికీ అన్నమయ్య కార్యక్రమాన్ని అమెరికాలోనూ నిర్వహిస్తామన్నారు.
Tags :