ASBL Koncept Ambience

తానా సంబరాలతో పులకించిన వాషింగ్టన్ డీసి

తానా సంబరాలతో పులకించిన వాషింగ్టన్ డీసి

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నగరం తెలుగు వైభవంతో పులకించిపోయింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభలు వాషింగ్టన్‌ డీసీలో గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో పాల్గొనేందు కోసం భారత్‌ నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన తెలుగువారితో, అమెరికా నలుమూలలా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగువాళ్ళతో వాషింగ్టన్‌ నగరం సందడిగా మారింది. మహాసభల ప్రాంగణమంతా తెలుగుమయమైపోయింది. తెలుగువాళ్ళ మాటలతో, పాటలతో, ఆటలతో సందడిగా కనిపించింది.

తానా మహాసభల కోసం వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను అందంగా ముస్తాబు చేశారు. దాదాపు 15వేలమందికిపైగా వచ్చిన అతిధులతో బాంక్వెట్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సినీ, రాజకీయ, సాహిత్య, నాటకరంగ ప్రముఖులతోపాటు, శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు కూడా ఈ బాంక్వెట్‌ కార్యక్రమాలకు హాజరయ్యారు.

తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన చేసిన స్వాగతోపన్యాసం ఆకట్టుకుంది. అమెరికా ప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న నేటి సాయంకాలం వారి సంబరాలకు తోడుగా తానా ఆధ్యర్యంలో 1983లో, 2007లో జరుపుకున్న తానా మహాసభలను గుర్తుచేసుకుంటూ, నాటి వైభవంలాగానే నేడు కూడా తానా తన మహాసభలను అంగరంగవైభవంగా జరుపుకుంటోందన్నారు. ఈ వేడుకలకు వేలసంఖ్యలో తెలుగువాళ్ళు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. 

సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు మాట్లాడుతూ, కాన్ఫరెన్స్‌ కార్యక్రమాలకోసం ఎంతోమంది రేయింబవళ్ళు శ్రమించారని, వారి కృషి ఫలితమే నేడు ఇంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. మరో రెండు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో తెలుగు సంస్కతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

ఈ వేడుకలకు స్థానిక తెలుగు సంఘమైన బహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కతిక సంఘం (జిడబ్ల్యుటీసిఎస్‌) సహ-ఆతిథ్యం అందించింది. ఈ వేడుకల్లో తానా సభల చైర్మన్‌తో డా.నరేన్‌ కొడాలితో పాటు, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, కోశాధికారి రవి పొట్లూరి, కార్యదర్శి లావు అంజయ్య చౌదరి, రవి మందలపు, పంత్ర సునీల్‌, చండ్ర దిలీప్‌, కిరణ్‌ చౌదరి, అశోక్‌బాబు కొల్లా, తానా మాజీ అధ్యక్షులు జయరాం కోమటి, నాదెళ్ల గంగాధర్‌, బోర్డ్‌ చైర్మన్‌ చలపతి కొండ్రకుంటతోపాటు, రాజా తాళ్లూరి,  మురళీ వెన్నం, ఉప్పుటూరి రాంచౌదరి, సూరపనేని రాజా, యాశ్‌ బొద్దులూరి, సుగన్‌ చాగర్లమూడి, పోలవరపు శ్రీకాంత్‌, ఆరోగ్య నిపుణులు వీరమాచినేని రామకష్ణ, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎల్లా కష్ణ, సుచిత్ర ఎల్లా, డీ.ఎ.తేజస్విని, సాహితీవేత్తలు లెనిన్‌బాబు, వాసిరెడ్డి నవీన్‌, టాంటెక్స్‌ మాజీ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేశ్‌ భీమ్‌రెడ్డి. నాటా నాయకుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery

Tags :