అమెరికాలో తెలుగువారికి తానా ప్రోత్సాహం - ధీంతానా పోటీలతో అవకాశం
అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కో ఆర్డినేటర్ రవి పొట్లూరి ఆధ్వర్యంలో జరిగే ఈ తానా 23వ మహాసభలను పురస్కరించుకుని కమ్యూనిటీని మహాసభల్లో పాల్గొనే విధంగా ఎన్నో కార్యక్రమాలను, పోటీలను తానా నిర్వహిస్తోంది. అందులో ధీంతానా కూడా ఒకటి. మీపాట, మీ ఆట, మీ అందానికి గుర్తింపు ఇచ్చేలా ఈ పోటీలను ధీంతానా పేరుతో నిర్వహిస్తోంది. సోలో సింగింగ్, గ్రూపు డ్యాన్స్, మిస్ టీన్ తానా, మిస్ తానా, మిసెస్ తానా, తానా చిలకగోరింక పేరుతో పోటీలను నిర్వహిస్తున్నారు.
ఈ పోటీలు ధీం-తానా ఛైర్ మాలతి నాగభైరవ, కోఛైర్స్ శ్రీలక్ష్మి కులకర్ణి మరియు సోహిని అయినాలా, అలాగే కమిటీ సభ్యులు పూలని జాస్తి, పల్లవి దొప్పలపూడి, ఆర్తిక అన్నే, ప్రియాంక గడ్డం పర్యవేక్షణలో దాదాపు 18 నగరాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి రీజియన్‌లో జరిగే పోటీల్లో ప్రతి విభాగంలోనూ ఇద్దరిని విజేతగా ఎంపిక చేస్తారు. ప్రాంతాలవారీగా గెలిచిన విజేతలందరూ తానా మహాసభల్లో జరిగే ఫైనల్ పోటీలకు అర్హులవుతారు. ఫైనల్ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి పారితోషికంతో పాటు సెలబ్రిటీ నుంచి మీ బహుమతిని అందుకునే అవకాశం లభిస్తుంది.
ఏఏ నగరాల్లో...
అట్లాంటాలో ఏప్రిల్ 30వ తేదీన, డిట్రాయిట్‌లో మే 13న, సీటెల్‌లో మే 14న, కొలంబస్‌లో మే 20న, ఫీనిక్స్ మే 20న, రాలేలో మే 21న, సెంట్‌లూయిస్‌లో మే 21న, అస్టిన్‌లో జూన్ 3న, చికాగోలో జూన్ 3న, డల్లాస్‌లో జూన్ 4న, లాస్ ఏంజెలిస్‌లో జూన్ 10న, శాన్‌ఫ్రాన్సిస్కోలో జూన్ 10న, న్యూయార్క్‌లో జూన్ 11న, న్యూజెర్సిలో జూన్ 11న, బోస్టన్‌లో, మినియాపొలిస్, వాషింగ్టన్‌డీసి, ఫిలడెల్ఫియాలో జూన్ 17న ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటల్లో పాల్గొనాలనుకునే వారు ఫ్లయర్‌లో ఇచ్చిన లింక్‌లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.