ఉత్సాహంగా సాగిన తొలిరోజు తానా మహాసభ వేడుకలు
అగ్రరాజ్యం అమెరికాలో తానా 23వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన్ను తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి సత్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురికి తానా ఎక్సలెన్స్ అవార్డులు అందజేశారు. అనంతరం ‘నటసింహం’ బాలకృష్ణను తానా ప్రతినిధులు సత్కరించారు. ఆ తర్వాత పలువురికి తానా మెరిటోరియస్ అవార్డులను బాలకృష్ణ అందజేశారు. ఈ వేడుకలకు భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా హాజరయ్యారు. ఆయన్ను కూడా తానా ప్రతినిధులు సత్కరించారు. చివర్లో ప్రముఖ నేపథ్య గాయని చిత్ర, సింహా, కౌసల్య తదితరులు తమ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఈ వేడుకలకు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తెలంగాణ కేబినెట్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ నేత సీతక్క, హీరోయిన్ శ్రీలీల తదితర ప్రముఖులు హాజరయ్యారు.