ఘనంగా మొదలైన తానా మహాసభలు.. సావనీర్ విడుదల
తానా 23వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడులకు జరుగుతున్నాయి. తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవిపొట్లూరి, చైర్మన్ శ్రీనివాస్ లావు, సెక్రటరీ సతీష్ తుమ్మల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు, డైరెక్టర్ ఓవర్సీస్ వంశీ కోట, మిడ్ అట్లాంటిక్ ఆర్ఆర్ సునీల్ కోగంటి, ట్రెజరర్ భరత్ మాదినేని, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ కూకట్ల, జాయింట్ ట్రెజరర్ వెంకట్ సింగూ, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, మాజీ ప్రెసిడెంట్ జయశేఖర్ తాళ్లూరి, సెక్రటరీ సతీష్ కుమార్ వేమూరి, ట్రెజరర్ అశోక్ బాబు కొల్ల, జాయింట్ సెక్రటరీ మురళీ తాళ్లూరి, జాయింట్ ట్రెజరర్ భరత్ మాదినేని, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ వెంకట్ కసుకుర్తి, కల్చరల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ శిరీష తునుగుంట్ల, వుమెన్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమ, కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ వెంకట హితేశ్వర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ, మాజీ ఆఫీస్ మెంబర్ డాక్టర్ హనుమయ్య బండ్ల, ఎక్స్ అఫీషియో మెంబర్ వెంకట రమణ యార్లగడ్డ, లక్ష్మీ దేవినేని, ఇందూ పొట్లూరి, ఈసీ ఫౌండేషన్ తదితరులంతా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. నందమూరి ‘నటసింహం’ నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి వసుంధర చేతుల మీదుగా జ్యోతిప్రజ్వలన కార్యక్రమం జరిగింది. అనంతరం తానా సభ్యులంతా కలిసి 23వ మహాసభల సావెనీర్ పుస్తకం ‘తెలుగు పలుకు’ను విడుదల చేశారు.
అనంతరం తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. ఎప్పుడూ రెండేళ్లకోసారి జరిగే తానా మహాసభలు ఈసారి నాలుగేళ్ల తర్వాత జరుగుతున్నాయని గుర్తుచేశారు. అలాగే ఎప్పుడూ 3-4 వేల మంది మాత్రమే ఈ సభలకు హాజరయ్యేవారని, కానీ ఈసారి 7-8 వేల మంది ప్రేక్షకులు వచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవిపొట్లూరి మాట్లాడుతూ.. ఈ సభలను విజయవంతం చేయడం కోసం అందరూ చాలా కష్టపడ్డారని, వాలంటీర్లు కూడా ఎంతో శ్రమించారని చెప్పారు.