23వ తానా మహాసభల వెబ్ సైట్ ప్రారంభం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు జూలై నెలలో 7,8,9 తేదీల్లో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో వైభవంగా జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందించేందుకు వీలుగా తానా మహాసభల వెబ్ సైట్ ను న్యూజెర్సిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కన్వీనర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో ప్రముఖ నిర్మాత, బిజినెస్ మెన్ టి.జి. విశ్వప్రసాద్ ఈ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సి ప్రముఖులు ఉపేంద్ర చివుకులతోపాటు తానా నాయకులు, కాన్ఫరెన్స్ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
https://tanaconference.org/index.html
Tags :