ASBL Koncept Ambience

అమెరికా చట్టసభల ఎన్నికల్లోకి మన మహిళలు

అమెరికా చట్టసభల ఎన్నికల్లోకి మన మహిళలు

హిల్లరీ ఓవైపు ప్రథమ మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించాలని చూస్తుంటే మరోవైపు ముగ్గురు భారతీయ అమెరికన్‌ మహిళలు కాంగ్రెస్‌లోకి అడుగుపెట్టి మరోరకం చరిత్ర సృష్టించేందుకు నడుబిగించారు. నవంబర్‌లో జరిగే కాంగ్రెస్‌ ఎన్నికల్లో మొత్తం 19 మంది మహిళలు పోటీపడుతున్నారు. అమెరికా చరిత్రలోనే ఇది అపురూప ఘట్టం అవుతుందని కాస్మొపాలిటన్‌ వంటి పత్రికలు రాస్తున్నాయి కాంగ్రెస్‌లో ప్రవేశం కోసం పోటీపడుతున్న మహిళల జాబితాలో భారతీయ సంతతికి చెందిన ప్రమీలా జయపాల్‌, కమలాహ్యారిస్‌, లతికామేరీ థామస్‌ సరికొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు సన్నద్ధమవుతున్నారు.

ప్రమీలా జయపాల్‌ వాషింగ్టన్‌ రాష్ట్రం నుంచి హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు పోటీ చేస్తున్నారు. కమలాహ్యారిస్‌ కాలిఫోర్నియా నుంచి సెనేట్‌కు పోటీ చేస్తున్నారు. లతికామేరీ ఫ్లారిడా నుంచి హౌజ్‌కు రిపబ్లికన్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. కాగా ప్రమీల, కమల డెమొక్రాటిక్‌ టికెట్‌పై తలపడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా బలపరిచిన కమల ప్రస్తుతం కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ పదవిలో ఉన్నారు. అమె తండ్రి జమైకా సంతతికి చెందిన వ్యక్తి. తల్లి శ్యామల గోపాలన్‌ తమిళనాడు  నుంచి 1969లో అమెరికా వచ్చారు. క్యాన్సర్‌ నిపుణురాలిగా అమెకు మంచి పేరుంది. చెన్నైలో జన్మించిన ప్రమీల 1982లో అమెరికా వచ్చి స్థిరపడ్డారు. ఆమె అభ్యర్థిత్వాన్ని వెర్మాంట్‌ సెనేటర్‌ బెర్నీసాండర్స్‌ బలపరుస్తున్నారు. లతిక తలిదండ్రులిద్దరూ వైద్యులే. 1972లో అమెరికా వచ్చి స్థిరపడ్డారు. ఎన్నికల్లో కమల ప్రమీల గెలిచే అవకాశాలున్నాయని ఒపీనియస్‌ పోల్స్‌ సూచిస్తున్నాయి.

 

Tags :