ASBL Koncept Ambience

నాట్స్‌ సాహితీ సంబరాలు

నాట్స్‌ సాహితీ సంబరాలు

చికాగోలో జరిగే అమెరికా తెలుగు సంబరాల్లో సాహితీవేత్తలతో ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎంతోమంది ప్రముఖ కవులు, రచయితలు, సినిమా దర్శకులు, పాటల రచయితలు ఇందులో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ళ భరణి, సినిమా పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సిలికానాంధ్ర చైర్మన్‌ ఆనంద్‌ కూచిభొట్ల, జర్నలిస్ట్‌, రాజకీయ విశ్లేషకుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, గజల్‌ గాయకుడు శ్రీనివాస్‌ తదితరులు ఈ కార్యక్రమానికి వస్తున్నారు.

Tags :