ASBL Koncept Ambience

ట్రంప్‍ బృందంలో 8 మంది భారతీయులకు చోటు

ట్రంప్‍ బృందంలో 8 మంది భారతీయులకు చోటు

భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ బృందంలో భారత సంతతికి చెందిన 8 మంది ప్రముఖులు కూడా ఉన్నారు. ఉన్నతస్థాయి అధికారులు, ప్రముఖులతో కూడిన ఈ బృందంలో అమెరికా అణు ఇంధన మంత్రిత్వ శాఖ అసిస్టెంట్‍ సెక్రటరీ రీటా బరన్‍వాల్‍ సహా కాశ్‍ పటేల్‍, బిమల్‍ పటేల్‍, ప్రేమ్‍ పరమేశ్వరన్‍, మనీషాసింగ్‍, అజిత్‍పాయ్‍, సీమావర్మ, సంపత్‍ శివాంగా ఉన్నారు.

గతంలో కుదిరిన అణు ఒప్పందంలో భాగంగా అణు విద్యుత్‍ కార్పొరేషన్‍ (ఎన్‍పీసీఎల్‍)తో కలిసి ఆరు అణు రియాక్టర్లను నిర్మించేందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై భారత అమెరికా ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ప్రతిపాదిత రియాక్టర్ల జాబితాలో ఆంధప్రదేశ్‍లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్రం కూడా ఉంది. అమెరికా చెందిన వెస్టింగ్‍ హౌజ్‍ ఎలక్ట్రిక్‍ కార్పొరేషన్‍ ఇక్కడ రియాక్టర్లను నిర్మించనుంది. అమెరికా బృందంలో ఉన్న అణు ఇంధన మంత్రిత్వశాఖ అసిస్టెంట్‍ సెక్రటరీ రీటా బరన్‍వాల్‍ భారత సంతతి వారే కావడం మనదేశానికి కలిసిరానుంది.

 

Tags :