బోర్దర్ లైన్ దగ్గర ప్రేమను పంచుకుంటున్న ప్రేమికులు
కర్టెన్ హన్స్న్ అనే 89 సంవత్సరాల రైతు జర్మనీ దేశం చివరలో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఉంటాడు. ఆయన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేమికురాలు ఇంగా రాస్ముసేన్ అనే 85 సంవత్సరాల మహిళ జర్మనీకి ఆనుకుని ఉన్న డెన్మార్క్ దేశంలో ఉత్తరాది చివరిలో ఉన్న ఓ చిన్న గ్రామంలో ఉంటోంది. వీరిద్దరూ అప్పుడప్పుడు ఒకళ్ళఇంటికి ఒకళ్ళు వెళ్ళి వస్తుంటారు. కాని కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ఆయా దేశాలు తమ సరిహద్దులను మూసి వేశాయి. దాంతో ఈ వృద్ధ ప్రేమికులు, స్నేహితులు ఇద్దరూ తమ వాహనాలతో బోర్డర్ వరకు వచ్చి అక్కడే రెండు కుర్చీలు వేసుకుని కాఫీ, టిఫిన్‍లు తింటూ మాట్లాడుకుంటారు. తాము తెచ్చుకున్న ఆహారం తిని ఇద్దరూ తిరిగి సాయంత్రానికి ఎవరికి వాళ్ళు తమ దేశానికి వెళ్ళిపోవడం చేస్తున్నారు. కరోనా దేశాల మధ్య గోడలను కట్టించినా, తమ మధ్య ఉన్న ప్రేమను, స్నేహాన్ని విడదీయలేదని, తమ మధ్య ఎలాంటి గోడ లేదని వారు పేర్కొంటున్నారు.