ASBL Koncept Ambience

కిల్లర్ లుక్ లో అనసూయ

కిల్లర్ లుక్ లో అనసూయ

తెలుగు టీవీ రంగంలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న యాంకర్ అనసూయ కెరీర్ ప్రారంభం ఒక న్యూస్ రీడర్‌గా అయినప్పటికీ, జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్‌గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అనసూయ వెనక్కి తిరిగి చూడకుండా, తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించింది. క్షణం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ, ఆమెకు భారీ గుర్తింపు తెచ్చిన సినిమా మాత్రం రంగస్థలం. అనసూయ తన పాత్రలు, సినిమాల ఎంపికలో తనదైన స్టైల్లో దూసుకుపోతూ నటిగా మంచి గుర్తింపు పొందుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ రెగ్యులర్‌గా తన అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ నిండుగా ఉన్న ఒక డిఫరెంట్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలు అనసూయ అందాన్ని చాలా కొత్తగా హైలైట్ చేస్తున్నాయి. ఈ ఫోటోలలో అను లుక్స్ కి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

 

 

Tags :