ASBL Koncept Ambience

కరోనాపై మాధవీలత కవితాస్త్రం

కరోనాపై మాధవీలత కవితాస్త్రం

కరోనా మహమ్మారిపై జనాన్ని అప్రమత్తం చేయడానికి కవితాస్త్రం సంధించింది కథా నాయిక మాధవీలత. టిక్‍టాక్‍ వేదికగా ఓ కవితను చదివి వినిపించింది. అందులో ఆమె ఇచ్చిన సందేశం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. ఇప్పటివరకూ ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో లక్షల మంది వీక్షించడంతో పాటు వేల మంది ఇష్టపడ్డారు. ఆ కవిత పూర్తి పాఠమిది.

మొదటి అంకె నేను అని
మొదటి స్థానం నాది అని
మొదటి నుంచి విర్రవీగే
మొదటి రకం పొగరుబోతా
మొదట కళ్లు తెరచి చూడు
ముసురుకున్న క్రిమిని చూడు
మొదలు లేదు  చివర లేదు
మొదలు అయితే అదుపు లేదు
రాజు అనే భయం లేదు
పేద అనే జాలి లేదు
సోకెనంటే అంటూ నేడు
ఇంటిలోనే కాదు కదా
ఊరిలోనే చోటు లేదు
దాచుకున్న డబ్బు రాదు
పేర్చుకున్న ఆస్తి రాదు
తెచ్చుకున్న పేరు రాదు
పెంచుకున్న కీర్తి రాదు
అండ రాదు దండ రాదు
ఆలి కూడా తోడు రాదు
అంత దూరమెందుకులే
దగ్గరైతే మహమ్మారి
అమ్మ రాదు నాన్న రాడు
నువ్వు చచ్చిపోతే శవం కూడా
ఇంటికి రాదు
మొదటి అంకె నేను అని
మొదటి స్థానం నాది అని
మొదటి నుంచి విర్రవీగే
మొదటి రకం పొగరుబోతా
భూమి పైన బతకడానికి మొదటి స్థానం వెతుకు
స్థానం అంటే ప్రాణమని తెలుసుకో
ఆ ప్రాణం  కాపాడుకుని బతికిపో

Tags :