హీరోయిన్ సంయుక్త మీనన్ అతిథిగా జీడబ్ల్యూటీసీఎస్ దీపావళి సంబరాలు
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంగం (జీడబ్ల్యూటీసీఎస్) ఆధ్వర్యంలో అగ్రరాజ్యంలో దీపావళి సంబరాలు జరగనున్నాయి. వర్జీనియాలోని జాన్ ఛాంపే హైస్కూల్ వేదికగా నవంబరు 4, శనివారం నాడు ఈ వేడుకలు జరుగుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు దీపావళి సంబరాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో 5 నుంచి 8 గంటల మధ్యలో డిన్నర్ కూడా అందజేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు కూడా జరుపుకుంటారు. డ్యాన్స్ ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్.. ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్లు జీడబ్ల్యూటీసీఎస్ వెల్లడించింది. ఈ సంబరాల్లో పాల్గొనాలని అనుకునే వారు https://tinyurl.com/GWTCS-Diwali2023 లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
Tags :