ASBL Koncept Ambience

బ్లాక్ శారీలో మెరిసిపోతున్న‌ శ్ర‌ద్ధా

బ్లాక్ శారీలో మెరిసిపోతున్న‌ శ్ర‌ద్ధా

నెపో కిడ్(Nepo Kid) గా బాలీవుడ్(Bollywood) ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన శ్ర‌ద్ధా క‌పూర్(Shraddha Kapoor) త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డానికి ఎంతో క‌ష్ట‌ప‌డింది. ప్ర‌భాస్(Prabhas) కు జోడీగా సాహో(Saaho) సినిమాలో న‌టించి టాలీవుడ్(Tollywood) కు ప‌రిచ‌య‌మైన శ్ర‌ద్ధా రీసెంట్ గా స్త్రీ2(Sthree2)తో సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకుంది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్పటికీ శ్ర‌ద్ధా క‌పూర్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా  శ్ర‌ద్ధా బ్లాక్ శారీలో ఎంతో అందంగా మెరిసింది. శ్ర‌ద్ధాను ఈ ఫోటోల్లో చూసిన వారు ఆమె అందాన్ని చూడ్డానికి రెండు క‌ళ్లు స‌రిపోవ‌ని కామెంట్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
 

 

 

Tags :