ASBL Koncept Ambience

తానా 23వ మహాసభల సందడి... హీరోయిన్‌ శ్రీలీల రాక

తానా 23వ మహాసభల సందడి... హీరోయిన్‌ శ్రీలీల రాక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతోపాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్‌ డైరెక్టర్లు వస్తున్నారు. ఈ మహాసభలను ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ లావు  కృషి చేస్తున్నారు. ఈ మహాసభల్లో పాల్గొనేందుకు హీరోయిన్‌ శ్రీలీల వచ్చినప్పుడు ఆమెకు తానా నాయకులు ఘన స్వాగతం పలికారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, జగదీశ్‌ ప్రభల ఇతరులు ఆమెను స్వాగతించారు.

 

 

Tags :