ASBL Koncept Ambience

గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీలో.. భారీ పెట్టుబడులు

గ్రీన్ ఎనర్జీ  రంగంలో ఏపీలో.. భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు (ఎంఒయు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో దావోస్‌లో చేసుకుంది. మచిలీపట్నంలో గ్రీన్‌ ఎనర్జీ ఆధారంగా ఎస్‌ఇజెడ్‌ ఏర్పాటుపై అదానీ గ్రూప్‌తో ఎంయుఓ జరిగింది. రూ.60 వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించిన ఎంఒయు అదానీ గ్రీన్‌ ఎనర్జీతో జరిగింది. కర్బన రహిత విద్యుదుత్పత్తికి గ్రీన్‌కో, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం, రూ.37 వేల కోట్ల పెట్టుబడితో 8 వేల మెగావాట్ల ఉత్పత్తికి గ్రీన్‌ ఎనర్జీతో ఎంఒయు జరిగింది. కాకినాడ ఎస్‌ఈజెడ్‌లో  6 వేల మెగావాట్ల ఎనర్జీ ఉత్పత్తిపై రూ.28 వేల కోట్ల పెట్టుబడితో అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఎంఒయూ జరిగింది. మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ ఏర్పాటుపై ఎస్‌అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

 

Tags :