ASBL Koncept Ambience

ఏపీలో పెట్టుబడులకు సై అన్న 'ఏజిల్ లాజిస్టిక్స్' చూపు

ఏపీలో పెట్టుబడులకు సై అన్న 'ఏజిల్ లాజిస్టిక్స్' చూపు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో చేపడుతున్న సంస్కరణలను, ప్రగతిని చూసి తాము ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే స్థిరమైన నిర్ణయం తీసుకున్నామని, కాకపోతే. అది ఎప్పుడు ఎలా అనే దాని గురించే ఆలోచిస్తున్నాం. త్వరలో అమరావతికి వచ్చి తదుపరి కార్యాచరణ చేపడతామని ముఖ్యమంత్రికి 'ఏజిల్‌ లాజిస్టిక్స్‌ సంస్థ' సీఈవో తరక్‌ సుల్తా అల్‌ ఎస్సా, డైరెక్టర్‌ ఉగెన్‌ మెన్‌ చెప్పారు.  ముఖ్యమంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన 'ఏజిల్‌ లాజిస్టిక్స్‌ సంస్థ' సీఈవో వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామని వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని తలచామని, ముఖ్యంగా సాంకేతికంగా ముందున్న ఆంధ్రప్రదేశ్‌ వైపు దష్టి సారించామని వెల్లడించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ అవసరాలు ఎలా ఉన్నాయో అధ్యయనం చేస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి సాంకేతిక పరిజ్ఞానానికి 'ఏజిల్‌ లాజిస్టిక్స్‌ సంస్థ' సీఈవో ముగ్ధుడయ్యారు. ప్రభుత్వ నేతగా ఉన్న వ్యక్తి నుంచి సాంకేతికతకు సంబంధించిన మాటలు వినడం తమకు అమితాశ్చర్యంగా ఉందని, కార్పొరేట్‌ సంస్థలకు చెందిన వారు సైతం ఇంత పరిజ్ఞానంతో మాట్లాడలేరని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ నిర్వహణకు 'ఏజిల్‌ లాజిస్టిక్స్‌ సంస్థ' సిద్ధంగా వుంది. మనదేశంలోని ముంబైలోనూ, ఆఫ్రికాలోని మరికొన్ని నగరాల్లోని వివిధ విమానాశ్రయాల్లో ఈ సంస్థ ఇప్పటికే గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్త్తోంది.

Tags :