ASBL Koncept Ambience

ఎఐఎ దసరా-దీపావళి వేడుకలు గ్రాండ్ సక్సెస్

ఎఐఎ దసరా-దీపావళి వేడుకలు గ్రాండ్ సక్సెస్

అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), దేశీ 1170 ఎఎం, బాలీ 92.3 ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా, దీపావళి  వేడుకలు ఘనంగా జరిగాయి. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈ కార్యక్రమంలో ఎన్నో అంశాలు చోటుచేసుకుని అందరినీ ఆనందపరిచాయి. మొదటిసారిగా ఓపెన్‌ ప్లేస్‌లో నిర్వహించిన ఈ వేడుకకు బే ఏరియాలోని దాదాపు 21 భారతీయ సంఘాలు సహకారాన్ని అందిచడంతోపాటు విజయవంతం కావడానికి కృషి చేశాయి. 10,000 మందికిపైగా ఎన్నారైలు ఇతరులు ఈ వేడుకకు హాజరయ్యారు. సంజీవ్‌ గుప్తా (సిపిఎ) సమర్పించిన ఈ వేడుకకు గ్రాండ్‌ స్పాన్సర్‌గా డా. ప్రకాశ్‌ అద్వాని (డిడిఎస్‌), ప్లాటినం స్పాన్సర్‌గా శిరీష సిన్హా (స్కై రియల్‌ ఎస్టేట్స్‌) సంపూర్ణ వాస్తుకు చెందిన నీరాజి మద్దతును ఇచ్చారు. ప్రధాన వేదికపై బాలీవుడ్‌ పాటలు, డ్యాన్స్‌లు హోరెత్తాయి. మరోవైపు మహిళలు దివ్వెల వెలుగును అందిస్తూ, రంగురంగుల ముగ్గులతో అక్కడ అంతా పండుగ వాతావరణాన్ని తలపింపజేశారు. దివాళీ క్విజ్‌, టాలెంట్‌ షోలో ఎంతోమంది పాల్గొన్నారు. అంత్యాక్షరి, డ్యాన్స్‌లతో కార్యక్రమాలు అందరినీ అదరగొట్టాయి.

ఈ వేడుకకు ఎంతోమంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. సెనెటర్‌ జిమ్‌ బీల్‌ (15వ సెనెట్‌ డిస్ట్రిక్ట్‌) అసెంబ్లీ మెంబర్‌ కాన్‌సెన్‌ చు (డిస్ట్రిక్ట్‌ 25, శాన్‌హోసె), అసెంబ్లీ మెంబర్‌ నోరా కాంపస్‌ (డిస్ట్రిక్ట్‌ 27, శాన్‌హోసె), వైస్‌ మేయర్‌ రోజ్‌ హెరెరా (శాన్‌హోసె), సూపర్‌వైజర్‌ దావే కర్టిస్‌ (డిస్ట్రిక్ట్‌ 3, శాన్‌హోసె), మేయర్‌ ప్రొ టర్మ్‌ కిర్‌స్టెన్‌ కీత్‌ (మెన్‌లో పార్క్‌), కె. వెంకట రమణ (ఇండియన్‌ కాన్సులేట్‌ ఆఫీస్‌, శాన్‌ఫ్రాన్సిస్కో), కౌన్సిల్‌ మెంబర్‌ గిల్బర్ట్‌ వాంగ్‌ (కుపర్టినో), కౌన్సిల్‌ మెంబర్‌ డార్సి పాల్‌ (కుపర్టినో), మేయర్‌ జోస్‌ ఎస్టీవ్స్‌ (మిల్‌పిటాస్‌), మేయర్‌ బిల్‌ హారిసన్‌ (ఫ్రీమాంట్‌), ఫార్మర్‌ కౌన్సిల్‌ మెంబర్‌ కతి వతనబె (శాంతాక్లారా), రాబర్ట్‌ గిల్‌ (శాంతాక్లారా బోర్డ్‌ అండ్‌ కమిషన్స్‌), రో ఖన్నా, సిల్వియా ఎరినాస్‌తోపాటు కమ్యూనిటీ నాయకులు ఎందరో ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఐఎ ను గుర్తిస్తూ సర్టిఫికెట్‌లను అందజేశారు.

లక్ష్మీదేవిని పూజించిన తరువాత రథంపై ఊరేగించారు. చాలామంది భక్తులు ఈ రథం లాగడానికి పోటీపడ్డారు. ఆలయం దగ్గరకు వచ్చినప్పుడు భక్తులు తన్మయత్వంతో అమ్మవారిని దర్శించుకున్నారు. చివరన అందరికీ లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. పీకాక్‌ ఫ్రీమాంట్‌, షాలిమార్‌, రసోయ్‌, పిస్తా హౌస్‌, బిర్యానీజ్‌, బావార్చి, అప్పకడై, క్యారట్స్‌ అండ్‌ బుబ్బ టీ తదితర సంస్థలవారు దేశీ ఫుడ్‌ పెస్టివల్‌లో పాలుపంచుకున్నారు. ఇక షాపింగ్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 60 సంస్థలు తమ బూత్‌లను ఏర్పాటు చేశాయి. చీరలు, నగలు, మెహందీ, రియల్‌ ఎస్టేట్‌, ఐటీ ట్రైనింగ్‌, హెల్త్‌ సర్వీసెస్‌ ఇలా ఎన్నో సంస్థలు తమ బూత్‌లను ఏర్పాటు చేశాయి. ఎక్స్‌పో సెంటర్‌ వద్ద నిర్వహించిన ఫ్యాషన్‌ షో, మహా మంగళ హారతి జరిగింది. బే ఏరియా చరిత్రలోనే మొదటిసారిగా రావణ దహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. బాణాసంచా కాల్చడంతో ఆకాశంలో నక్షత్రాలకు పోటీగా తారాజువ్వలు ఎగసిపడ్డాయి. బే ఏరియా తెలుగు సంఘం కూడా ఈ వేడుకల్లో పాల్గొంది.  చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.

Link to pictures:http://www.shreeimage.com/Events/AIA-Events/AIA-Dussehra-Diwali-Dhamaka/n-DJF6Vt

 

Tags :