వైభవంగా ఆల్బనీ సంక్రాంతి సంబరాలు
ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 16వ తేదీన హిందూ కల్చరల్ సెంటర్‌లో సంక్రాంతి వేడుకలను వైభవంగా జరిపారు. దాదాపు 1000 మంది ఈ వేడుకలకు హాజరై కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో కొత్త కార్యవర్గం కొలువు దీరింది. సురేష్ మల్నీది (ప్రెసిడెంట్), యాది రెడ్డి దూది (సెక్రటరీ), శిరీష నల్లమోతు (జాయింట్ సెక్రటరీ), శ్రీనివాసు మంగ (ట్రైజరర్), రవీంద్ర ఉప్పల (జాయింట్ ట్రెజరర్), సుధా దాట్ల, స్వర్ణలత కోట, భాస్కర్ పెరుమాళ్ళ, సందీప్ నాగులపల్లి, వెంకట్ ములుకూరి, వేణు చదలవాడతో కూడిన కొత్త బోర్డు ప్రమాణ స్వీకారం చేసింది.
వేడుకలకు స్పాన్పర్లుగా వ్యవహరిస్తున్నవారిని, ఆటా గత పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం సందర్భంగా ముగ్గుల పోటీలను, గాలిపటాల పోటీలను ఏర్పాటు చేశారు. విజేతలకు బహూమతులను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు, పెద్దలు చేసిన నృత్యాలు అందరినీ అలరించింది. స్థానిక డ్యాన్స్ స్కూల్స్ విద్యార్థులు, నాదం మ్యూజికల్ గ్రూపు వారు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. దాదాపు 125 మంది చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. వచ్చినవారందరికీ తెలుగువంటకాలను వడ్డించారు.