ASBL Koncept Ambience

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే

నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో సందడి చేయనున్న డీజే

బన్నీతో పాటు దేవీశ్రీప్రసాద్.. హరీష్ శంకర్

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే నాట్స్ తెలుగు సంబరాల్లో ఈ సారి డీ.జే టీమ్ సందడి చేయనుంది.. ఈ సారి చికాగో వేదికగా జరిగే ఈ అమెరికా తెలుగు సంబరాల్లో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్, దర్శకుడు హరీశ్  శంకర్, సంగీతదర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్, కథనాయికి పూజా హెగ్డే తదితరులు నాట్స్ తెలుగు సంబరాలకు విచ్చేస్తున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ చికాగోలో జరిగే  సంబరాలను అత్యంత ఘనంగా జరిపేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది.. ఇప్పటికే వేలమంది ఈ సంబరాల్లో పాలుపంచుకునేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పాటు దేవీ శ్రీ ప్రసాద్ కూడా వస్తుండటంతో అమెరికాలో ఉండే తెలుగు సినీ ప్రేమికులు సంబరాలకు మేముసైతమంటూ ముందుకొస్తున్నారు. సంబరాలకు డీజే టీమ్ తో పాటు జబర్థస్ట్ టీమ్ కూడా రానుంది. దీంతో సంబరాల్లో ఆట.. పాటతో పాటు కామెడీ షోలు కూడా కావాల్సినంత సంతోషాన్ని పంచనున్నాయి. 

 

Tags :