ASBL Koncept Ambience

పాత మిత్రుల వేదిక.. తానా అలూమ్ని వేదిక

పాత మిత్రుల వేదిక.. తానా అలూమ్ని వేదిక

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను  ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు.  రెండు తెలుగు రాష్ట్రాలలోని కళాశాలల్లో చదువుకొని అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థుల కోసం వివిధ కళాశాలల ఆలూమ్ని సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.  తెలుగు జిల్లాల ఎన్నారై మీట్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. వివిధ కళాశాలల అలూమ్ని, జిల్లా ఎన్నారైల సమావేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బాపట్ల అలూమ్ని, ఆటీ, కృష్ణ ఎన్నారై. ఆర్గ్‌, కెఎస్‌ఆర్‌ఎంసిఇ, ఎన్‌బికెఆర్‌ కాలేజీ, రాయలసీమ మీట్‌, కెఎల్‌సి ఇంజనీరింగ్‌ మీట్‌, యుఎస్‌ఎ కెవైఎస్‌ఎస్‌ అలూమ్ని, కడప అలూమ్ని, బిట్స్‌ పిలానీ అలూమ్ని, ప్రకాశం మీట్‌, గోదావరి ఎన్నారై మీట్‌, గీతం ఫ్రెండ్స్‌ మీట్‌, చిత్తూరు ఎన్నారై మీట్‌, గుంటూరు ఎన్నారై మీట్‌, వైజాగ్‌ అలూమ్ని మీట్‌, బళ్ళారి విఇసి అలూమ్ని సమావేశాలు ఈ వేదికపై జరగనున్నాయి. 

ఈ సమావేశాల్లో ఆయా కళాశాలల పాతమిత్రులంతా పాల్గొనాల్సిందిగా తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి కోరారు.

 

 

Tags :