డిసెంబర్ 5 నుంచి 26 వరకు తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు మరియు సేవా డేస్
అమెరికా తెలుగు సంఘం 1980లో తెలుగువారి కోసం స్థాపించబడింది. తెలుగు భాష, సాంస్కృతిక, సంప్రదాయాలు, పండుగలు, సాంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలను రూపకల్పన చేసి అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్న తెలుగు వారి నందరిని ఒక వేదికపైకి చేర్చి తెలుగువారికి ఒక గొప్ప మాతృ సంస్థగా నిలిచింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా రోడ్డు ప్రమాదాలు, గృహములలో జరిగే ఆకస్మిక ప్రమాదాలు, కళాశాలలో ఏమైనా చిక్కు సమస్యలు వస్తే పెద్దదిక్కుగా అండగా నిలబడడము, ఎలాంటి ఆపద సమయాలలో అయినా ఆటా కార్యవర్గ అప్రమత్తంగా ఉండి సహాయం చేయడం, అమెరికా దేశం జీవన విధానంలో ఉన్నటువంటి చట్టబద్దమైన నిభందనలు, కట్టుదిట్టాలు వీటి వల్ల ఎంతో జాగ్రత్త అవసరం, అందుకు అనుగుణంగా ఇమిగ్రేషన్ పరంగా వ్యాపార పరంగా, వైద్యపరంగా, పన్నులు ఆయా వృత్తులలో ఉత్తీర్ణులైన లాయర్స్ (టాక్సెస్) డాక్టర్స్, సిఎస్.ప్, వ్యాపార వేత్తలు ఇలా ఎంతో మంది నిపణులతో సలహాలు, సూచనలు ఇవ్వడం ఎప్పటికప్పుడు నిరంతరంగా ఈ సేవ కొనసాగుతూ ఉంది మన తెలుగు వారికి మాత్రమే. కాకుండా అమెరికా నివాసులందరికి రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, హోమ్ లెస్ వారికి అన్నదానాలు, సేవారంగములో, రక్షణారంగములో ఉన్నవారికి కృతజ్ఞతగా పుడ్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు, అమెరికాలో పుట్టిపెరిగే మన తరువాతి తరం వారికోసం శాస్త్రీయా, సంగీతం, లలితకళ, జానపదం, సాహిత్య కార్యక్రమాలు, ఆధ్మాత్మిక, విద్యకి సంబందించిన ప్రవేశ పరీక్షలు, టెక్నాలజీ శిక్షణ, యోగా లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ కొనసాగుతుంది.
మహిళా కార్యక్రమాలు, బాగా చదువుకునే వారి కోసం స్కాలర్ షిప్, వివిధ రంగాలలో నైపుణ్యత కలిగిన వారికి సన్మాన కార్యక్రమాలు ఎన్నో నిరంతరంగా చేస్తూ ఉంది. రెండు సంత్సరాలకొకసారి ఆటా మహాసంబరాలు అమెరికా దేశంలో పెద్ద ఎత్తున ఆట సంస్థ జరుపుతుంది. మాతృ భూమి నుండి అన్ని రంగాలకు సంబంధించిన ఎంతో మంది దిగ్గజాలను అతిథులుగా ఆహ్వానిస్తుంది. అన్నిటికన్నా తల్లి సేవ, గొప్పది. మాతృ భూమికి ఎంత చేసిన ఋణం తీర్చు కోలేము అంటూ అందుకుగాను ఆటా మహా సంబరాలను జరిపే ముందే డిసెంబర్ మాసంలో గత ఇరవై సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలకు, పట్టణాలకు ఆటా సంస్థ కార్యవర్గం వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉన్నతస్థాయి మంత్రులను, ఇక్కడి పాలకులను, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలవడం, సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథులుగా పిలవడం, భాగస్వాములను చేయడం సంస్థకు ఎంతో గర్వాన్ని, గౌరవాన్ని సంతోషాన్ని కలుగచేస్తుంది.
అందులో భాగంగా ఈసారి మధు బొమ్మి నేని ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకలు మరియు ఆటా సేవ డేస్ చైర్ గా బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షులు భువనేశ్ బూజాల, ఆటా పాలకమండలి సభ్యులు, ఆటా వేడుకలు మరియు ఆటా సేవా డేస్ కో చైర్స్ శరత్ వేముల, అనిల్ బొద్దిరెడ్డి, మరికొందరు పాలకమండలి సభ్యులు, కార్యవర్గ బృందం తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎంతో బాధ్యతతో పనులు నిర్వహిస్తూ, పెద్దమొత్తంలో దాతలుగా ఉన్నవారు వారితో పాటు తెలుగు రాష్ట్రాల స్థానికులు, మరికొంత మంది దాతలుగా వచ్చి ఈ కార్యక్రమాలకు సహాయపడుతున్నారు. రాబోయే సంవత్సరం జులై 1, 2022 నుండి జులై 3, 2022 వరకు అమెరికా రాజధాని అయినా వాషింగ్టన్ డీ. సివాల్టర్. ఇకన్వెన్షన్ సెంటర్ లో అధ్యక్షులు భువనేశ్ బూజల సారథ్యములో పాలకమండలి మరియు కార్యవర్గ బృందం అంతా కలిసి నిర్వహించే 17వ ఆటా మహాసభలు మరియు యువ సమ్మేళనం జరిపే ముందు మాతృదేశములో ఆటా సేవ్ డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
డిసెంబర్ 5 నుంచి 25 వరకు సేవా కార్యక్రమాలు ఆటా సంస్థ కొనసాగిస్తుంది.
డిసెంబర్ 6న వనపర్తిలో వెటర్నీరీ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబరు 7న నల్గొండలో వైద్య శిబిరం. డిసెంబర్ 8 మరియాల్, భువనగిరిలో ఆర్యోగ మరియు నేత్రశిబిరం కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబరు 10న హైదరాబాద్‌లో అనాథ ఆశ్రమంను సందర్శించి, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబరు 11న హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల సాహితీ వేత్తలతో సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నారు. డిసెంబరు 13న వరంగల్‌లో స్కూల్ ప్రాజెక్ట్ మరియు హనుమకొండలో వాగ్గేయకారుల సంగీతోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డిసెంబరు 14న గుడిపాడు, వరంగల్‌లో ఆర్వో వాటర్ ప్లాంట్ మరియు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తారు. డిసెంబర్ 15న కడ్తాయి, రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి, నాగర్ కర్నూల్‌లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న వేలుపల్లి, దత్తాయిపల్లి, యాదాద్రిలో స్కూల్‌లో రేనోవేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్. డిసెంబర్ 18న తిరుపతిలో ఆటా సాంస్కృతిక కార్యక్రమం, డిసెంబర్ 21న వైజాగ్‌లో బిజినెస్ కాన్ఫరెన్స్, డిసెంబరు 22న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహిస్తారు. 23న చిట్యాల, నల్గొండలో కాన్సర్ స్క్రీనింగ్, హైదరాబాద్‌లో బిజినెస్ కాన్ఫరెన్స్. డిసెంబర్ 23న జాలు కాలువ, నల్గొండలో అంగవ్వాడీ బిల్డింగ్ ప్రారంభోత్సవం, మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో కంప్యూటర్ ల్యాబ్ డొనేషన్ కార్యక్రమం. ఆటా వేడుకలలో భాగంగా ఆటా నాదం పాటల పోటీల కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల యువ గాయనీ గాయకుల కోసం అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఆన్‌లైన్‌లో ఆటా సంస్థ ఘనంగా నిర్వహించి నలుగురు ఉత్తమ గాయనీ గాయకులను ఎన్నుకుంది. డిసెంబర్ 26, 2021న రవీంద్రభారతి హైదరాబాద్‌లో ఆటా వేడుకల మహోత్సం శాస్త్రీయ, జానపద, సినీ సంగీత మరియు నృత్య సంస్కృతిక వైభవాలు, ఆటా నాదం విజేతలకు గుర్తింపు అవార్డులు, వివిధ రంగాలలోని నిపుణులకు సత్కార్యాలు, జీవిత సాఫల్య పురస్కారాలు వంటి కార్యక్రమాలు అమెరికా తెలుగ సంఘం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ సంస్థ అందరికి ఆహ్వానం పలుకుతుంది.
భువనేశ్ బూజాల, ఆటా అధ్యక్షులు
మధు బొమ్మినేని, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకలు మరియు ఆటా సేవ్ డేస్ చైర్
అనిల్ బొద్దిరెడ్డి, ఆటా సేవ్ డేస్ కో చైర్స్
శరత్ వేముల, ఆటా సేవా డేస్ కో చైర్స్
ఆటా పాలకమండలి సభ్యులు.