ASBL Koncept Ambience

డిసెంబర్‌ 5 నుంచి  తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు

డిసెంబర్‌ 5 నుంచి  తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు

అమెరికా తెలుగు సంఘం అమెరికాలోని తెలుగువారితోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిటీకి వివిధ రకాల సేవలందిస్తోంది. అమెరికాలో నిర్వహించే ఆటా మహాసభలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఆటా వేడుకలు పేరుతో వివిధ రకాల సేవ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ఆటా వేడుకలు డిసెంబర్‌ 5 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ వేడుకల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఆటా ఏర్పాటు చేసినట్లు ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల, ఆటా వేడుకల చైర్‌ మధు బొమ్మినేని తెలిపారు. ఆట, పాట పోటీలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు, సెమినార్స్‌, మహిళా సాధికారత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ వేడుకల్లో ఆటా సభ్యులు పలువురు తమ తమ గ్రామాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చారని, వారు కోరినట్లుగా వారు చెప్పిన ప్రాంతాల్లో వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు భువనేష్‌ బుజాల, మధు బొమ్మినేని వివరించారు. ఈ వేడుకలకు కో చైర్‌ గా అనిల్‌ బొద్దిరెడ్డి, శరత్‌ వేముల కూడా కో చైర్‌ గా వ్యవహరిస్తున్నారు. 

Bhuvanesh Boojala, ATA President  
Madhu Bommineni, ATA President-elect 
Sudheer Bandaru, Conference Convener 
Anil Boddireddy, Vedukalu co-chair 
Sarath Vemula, Vedukalu co-chair 
Ramakrishna Reddy Ala

 

Tags :