పులివెందులలో జగన్ ట్యాక్స్ ఉంది: సీఎం చంద్రబాబు
రైతుల నుంచి జగన్ వాటా తీసుకుంటున్నారు
దేశంలో ఎక్కడా ఇలాంటి ట్యాక్స్ చూడలేదు
ముందుముందు జగన్ ఆటలు సాగనివ్వం
జీఎస్టీ లాగా పులివెందులలో జేఎస్టీ (జగన్ ట్యాక్స్) ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. కడప జిల్లా పులివెందులలో నిర్వహించిన టీడీపీ రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా ఇలాంటి ట్యాక్స్ చూడలేదని, ముందుముందు జగన్ ఆటలు సాగనివ్వమని, దళారీ వ్యవస్థ పోవాలని హెచ్చరించారు. రైతుల నుంచి జగన్ వాటా తీసుకుంటున్నారని ఆరోపించారు. కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్ వర్గానిది అని, వైసీపీ నేతలకు దోచుకోవడం తప్ప మరేమీ చేతకాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ట్యాక్స్ లేకుండా పంటకు మద్దతు ధర ఇప్పిస్తానని రైతులకు హామీ ఇస్తున్నానని అన్నారు. ఈ రాష్ట్రంలో ఉండని జగన్ కు, ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని జగన్ కు ఇక్కడి ఓట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. పులివెందులలో ఏకపక్షంగా ఓటింగ్ జరగాలని, టీడీపీని గెలిపించాలని కోరారు.