16 మంది సభ్యుల బృందంతో చంద్రబాబు అమెరికా పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బందితో కూడిన 16 మంది సభ్యుల బృందం కూడా అమెరికా వెళుతోంది. వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, అధికారులు జి.సాయిప్రసాద్, అజయ్‌జైన్, సాల్మన్ ఆరోఖ్యరాజ్, కె.విజయానంద్, జాస్తి, కృష్ణకిశోర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు జేఏ చౌదరి, విదేశాల్లోని తెలుగువారి వ్వవహారాలు, పెట్టుబడులపై ప్రభుత్వ సలహాదారు వేమూరు రవికుమార్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాసరావు, వ్యక్తిగత సహాయకుడు బి.రాజగోపాల్, ముఖ్య భద్రతాధికారులు ఎల్.సుబ్బారాయుడు, సీహెచ్, భద్రయ్య, భద్రతాధికారులు జి.విశ్వనాథం, సీహెచ్ పీటర్ ఉన్నారు. ఈ బృందం కాలిఫోర్నియా, శాన్‌జోస్, శాన్ ప్రాన్సిస్కో, షికాగో, న్యూయార్క్, న్యూజెర్సీల్లో పర్యటిస్తుంది. అమెరికా, భారత వాణిజ్య మండలి సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొంటారు. టైకాన్ సదస్సుకి హాజరవుతారు.