చంద్రబాబుకు చండీమాత విగ్రహం బహూకరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న అయుత చండీ మహాయాగం చివరి రోజు పూర్ణాహుతి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ వద్ద మంత్రి హరీష్‌రావు స్వాగతం పలకగా, యాగశాల ప్రధాన ద్వారం వద్ద రుత్విజులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట వచ్చిన కెఇ. కృష్ణమూర్తి, సుజానాచౌదరి, ఘంటా శ్రీనివాసరావు తదితరులకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు బృందం మొదటి యాగశాలలో ప్రదక్షిణ చేశారు. విజయవాడ కనక దుర్గమ్మ నుంచి తెచ్చిన కానుకలను హోమగుండంలో సమర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వారిని శివపార్వతుల విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. కేసీఆర్ తో పాటు చంద్రబాబు బృందం అక్కడ పూజల్లో పాల్గొన్నారు. వారికి చండీమాత విగ్రహన్ని బహుకరించి, శాలువాతో సత్కరించారు.