ASBL Koncept Ambience

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి : చంద్రబాబు

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి : చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి శంకుస్ధాపన వేదికపై చంద్రబాబు ప్రసంగించారు. విజయదశమి రోజున ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన  జరిగిందన్నారు. దేశమంతటికీ ఇప్పుడు విజయదశిమి ఒక్కటే పండగని, ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శంకుస్థాపనతో కలిసి రెండు పండగలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేసే ఈ రాజధాని ఒక చరిత్ర సృష్టిస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులొచ్చాయి. రాష్ట్రంలోని 13వేల గ్రామాలు, 3వేల వార్డులు, గాంధీజీ, సుభాష్‌చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, ఆరాధ్యదైవం ఎన్టీఆర్‌ తదితరులు పుట్టిన ప్రదేశాల నుంచి మట్టిని తెచ్చామన్నారు.

ప్రధాని నరేంద్రమోడీ కూడా ప్రజాస్వామ్య వేదిక పార్లమెంటు దగ్గరి నుంచి పుట్టమట్టి, యమునా నది నీటిని తెచ్చారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ద, జైన, బ్రహ్మకుమారిలు తదితరులంతా ప్రార్థనలు చేశారు.  ప్రధాని సహకారంతో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరం నిర్మిస్తామన్నారు. సింగపూర్‌ ప్రభుత్వాన్ని  నేనే మాస్టర్‌ ప్లాన్‌ ఇవ్వాని విజ్ఞప్తి చేశా. అడిగిన వెంటనే మంత్రి వర్గ తీర్మానం చేసి ఎంవోయూ చేసుకున్నారు.  సింగపూర్‌ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తరపున అభినందిస్తున్నా.

ఆంధ్రప్రదేశ్‌్‌ రాష్ట్రం 2020 నాటికి నంబర్‌వన్‌గా ఉంటుందని, ఉండాలని  తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కలిసి ముందుకు పోతాయన్నారు. స్వచ్ఛభారత్‌, తదితర కార్యక్రమాలు విజయవంతం చేస్తామన్నారు. పోలవరం ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలిపినందుకు, అమరావతి నిర్మాణానికి సహకరించినందుకు, పిలువగానే వచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం ఉంటుందని అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిని తెలుగువారిగా అందరం కలిసుండాలన్నదే తన అభిమతమని తెలిపారు. విభజన చట్టం వల్ల ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం లభించిందని అన్నారు. 

విద్యాకేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్న మన ఆకాంక్షలను అనుగుణంగా ఏడు జాతీయ విద్యా సంస్థలను కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిందన్నారు.  రాజధాని కోసం కేంద్ర మూడు విడతలుగా రూ.1850 కోట్లు సాయం చేసిందన్నారు. డిజిటల్‌ ఇండియా, నదుల అనుసంధానం, మేకిన్‌  ఇండియా ఇవన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కష్టించి పనిచేసే తత్త్వం ఉన్నవాళ్లు. ఇదే కష్టం కొనసాగిద్దామన్నారు. అంతా కలసి తెలుగు జాతి గర్వించదగ్గ రాజదాని నిర్మించుకుందాం.

 

Tags :