లండన్ లో చంద్రబాబు పర్యటనకు విశేష ఆదరణ
లండన్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్నీచోట్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం టాప్ 20 కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్మార్ట్‌సిటీ నిర్మాణంపై పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. అమరావతికి గుర్తింపుతోపాటు నిధుల సేకరణే లక్ష్యంగా చంద్రబాబు లండన్ పర్యటనను చేస్తున్నారు. అక్కడి కమ్యూనిటీతో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. లండన్ స్మార్ట్‌సిటీ మోడల్‌ను కూడా చంద్రబాబు చూశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గ్రేటర్ లండన్ అథారిటీ, ఆర్‌ఐసీఎస్ ఇలా ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో సమావేశమయ్యారు. థేమ్స్ నది అందానికి చంద్రబాబు ముగ్దుడై బోటు షికారు కూడా చేశారు. అమరావతిలో లండన్ ఐ తరహా పర్యాటక కేంద్రం ఏర్పాటును పరిశీలించాలని అధికారులను చంద్రబాబు కోరారు. వివిధ రంగాల వారితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.