4న శాన్‌ఫ్రాన్సిస్కో కు చంద్రబాబు రాక
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం మే 4వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కో రానున్నారని సమాచారం. తన పర్యటనలో భాగంగా వివిధ వర్గాల ప్రముఖులతోపాటు కాలిఫోర్నియా ఉన్నతవర్గాలను కూడా ఆయన కలుసుకోనున్నారు. కాలిఫోర్నియా స్టేట్‌తో సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. 5వ తేదీన ఆయన సిలికాన్‌వ్యాలీలో ఉన్న పలువురు సిఇఓలతో సమావేశం కానున్నారు. 6వ తేదీ శనివారం మధ్యాహ్నం ఆయన డల్లాస్‌కు పయనమవుతారు. ఆ రోజు రాత్రి ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఎన్‌ఆర్‌టీ కమ్యూనిటీ డిన్నర్‌కు హాజరవుతారు. 7వ తేదీన లోవా స్టేట్ గవర్నమెంట్ అధికారులతో సమావేశమవుతారు. సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. 7వ తేదీ మధ్యాహ్నం ముఖ్యమంత్రి తిరిగి శాన్‌హెసె చేరుకుంటారు. ఆరోజు రాత్రి శాన్‌హోసెలోని ఈవెంట్ సెంటర్‌లో జరిగే కమ్యూనిటీ రిసెప్షన్‌లో ఆయన పాల్గొంటారు. 8,9 తేదీల్లో కూడా ఆయన బే ఏరియాలోనే ఉంటారని ప్రస్తుత సమాచారం. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఎపి జన్మభూమి, ఎపిఎన్‌ఆర్‌టీ నాయకులు, ఎన్నారై టీడిపి అభిమానులు కృషి చేస్తున్నారు.