మత్స్యకార భరోసా పథకం ప్రారంభించిన సీఎం
మత్స్యకారుల జీవితాలు మార్చేందుకు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి చాలా కష్టాలున్నాయని మత్స్యకారుల కష్టాలు మరింత పెద్దవిగా భావించే వారికి సాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. అమరావతిలో వైఎస్‍ఆర్ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను రూ.4 వేలు ఇచ్చే వారమని చెప్పారు. ఈ పథకంలో భాగంగా దాదాపు 1.09 లక్షల కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.
మత్స్యకారుల డీజిల్ రాయితీ రూ.6 నుంచి రూ.9కి పెంచినట్లు చెప్పారు. మెకనైజ్డ్ బోటుకు నెలకు రూ.3వేల లీటర్లు, మోటారైజ్డ్ బోటుకు నెలకు 300 లీటర్లు ఇస్తున్నట్లు వివరించారు. చేపల వేటకు వెళ్లి ఎవరైనా మరణిస్తే రూ.10 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్నట్లు జగన్ చెప్పారు. మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేస్తామని సృష్టం చేశారు. అంతేకాకుండా ఇకపై రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ గుజరాత్, ఇతర చోట్లకు వలస వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.