వైఎస్ఆర్ సున్నా వడ్డీ ప్రారంభించిన సీఎం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ అందించే వైఎస్‍ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల వడ్డీ మొత్తాన్ని ఆన్‍లైన్‍లో జమ చేశారు. ఈ పథకం ద్వారా 8.78 లక్షల పొదుపు సంఘాల్లో ఒకేసారి రూ.1400 కోట్ల వడ్డీని జమచేశామని, దీంతో సుమారు 91 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పథకం ప్రారంభించిన అనంతరం వివిధ జిల్లాల స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్ మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ మహిళలకు అండగా నిలబడాలనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు.
Tags :