ASBL Koncept Ambience

స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ

స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ

విశాఖను యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. దావోస్‌ పర్యటనలో భాగంగా వివిధ అంకుర సంస్థల (స్టార్టప్‌) వ్యవస్థాపకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు (సీఈవోలు), ఇతర ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అంకుర సంస్థల ఏర్పాటు, అభివృద్ధిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా అంకుర సంస్థల కార్యాకలాపాలను ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగస్వాములు కావాలని మీ అందరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అంకుర సంస్థల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటాం. అవసరమైన వనరులను ప్రభుత్వం సమకూరుస్తుంది. విధానపరమైన నిర్ణయాలు ఎలా ఉండాలి అని ఆలోచిస్తున్నాం అని పేర్కొన్నారు.

 

Tags :