ఏపీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ... తొలి రోజు చేసుకున్న ప్రధాని ఒప్పందాలు ఇవే
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో మొదటి రోజు ప్రధాన వేదికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు జరిగాయి. వాటిలో ఎక్కువ శాతం పునరుదాత్పదక ఇంధన వనరుల ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు సంబంధించినవి. ఆయా సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థలు ... ఎన్టీపీసీ రూ.2,35,00 కోట్లతో 77,000 మందికి ఉపాధి. ఏబీసీ లిమిటెడ్ 1,20,00 కోట్లతో 7,000 మందికి ఉపాధి. రెన్యూ పవర్ 97,500 కోట్లతో 16,500 మందికి. ఇండోసోల్ 76,033 కోట్లతో 13,200 మందికి, అవాడా గ్రూప్ 50.000 కోట్లతో 7,300 మందికి, గ్రీన్ కో 47,600 కోట్లతో 10,000 మందికి, అదానీ గ్రీన్ ఎనర్జీ 21,820 కోట్లతో 14,000 మందికి, సరెంటికా రెన్యూవబుల్స్ 12,500 కోట్లతో 2,000 మందికి, ఎకోరన్ ఎనర్జీ ఇండియా 10,500 కోట్లతో 3,000 మందికి, అరబిందో గ్రూప్ 9,015 కోట్లతో 4,150 మందికి, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ 8,855 కోట్లతో 5,750 మందికి, శ్యామ్ గ్రూప్ 7,700 కోట్లతో 5,000 మందికి, ఆదిత్య బిర్లా గ్రూప్ 7,305 కోట్లతో 1,250 మందికి, శ్రీ సిమెంట్స్ 5,500 కోట్లతో 1,000 మందికి, మోండలెజ్ 1,600 కోట్లతో 150 మందికి, ఒబెరాయ్ 1,350 కోట్లతో 1,250 మందికి ఉపాధి కల్పించనున్నాయి.