ASBL Koncept Ambience

ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం

ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. మంత్రి నారా లోకేష్‌ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో డెవలప్‌మెంట్ సెంటర్‌ను గూగుల్ ఎక్స్ ప్రారంభించనుంది అమెరికాలో తప్ప ఏ ఇతర దేశంలోనూ కార్యకలాపాలు సాగించని గూగుల్ ఎక్స్.. తాజా ఒప్పందం ద్వారా తొలిసారి ఆంధ్రప్రదేశ్ కు రావడం విశేషం. విశాఖపట్టణంలో త్వరలో ఇది ఏర్పాటు చేయనున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో ప్రసిద్ధమైన సంస్థ గూగుల్ ఎక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ఐటీ శాఖ అధికారులు - గూగుల్ ఎక్స్ సీఈఓ అస్టో టెల్లర్ మధ్య ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ కు సంబంధించి ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించనున్నట్లు సమాచారం అందుతుంది.

అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకానుంది. ఫైబర్ గ్రిడ్ తో ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ను గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా - వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాలకు కూడా అత్యంత వేగవంతంగా బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ అందుబాటులోకి తేనుంది. కాగా ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ…గూగుల్ ఎక్స్ రాకతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనికేషన్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని తెలిపారు.

Click here for Photogallery

 

Tags :