ఎపిఇన్వెస్ట్ పోర్టల్ ను ప్రారంభించిన నారా లోకేష్
అమెరికా పర్యటనలో భాగంగా బే ఏరియా వచ్చినప్పుడు సిలికాన్ వ్యాలీలోని తెలుగు ఎన్నారై వ్యాపారవేత్తలు రూపొందించిన ఎపిఇన్వెస్ట్ డాట్ ఇన్ (http://www.apinvest.in/) ను నారా లోకేష్ ప్రారంభించారు. ఎన్నారై వెబ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫౌండేషన్ బిజినెస్ వెబ్ పోర్టల్ అయిన దీనిని ఎన్నారై టిడిపి నాయకుడు జయరామ్ కోమటి ఆధ్వర్యంలో కృష్ణ మట్టపర్తి, జయప్రసాద్ వెజెండ్ల, వినయ్ పరుచూరి, కుమార్ విదదాల కలిసి ఈ బిజినెస్ పోర్టల్‌ను రూపొందించారు. ఎపిఎన్నారై వ్యాపారవేత్తలకు వ్యాపారంలో మెలకువలు, పెట్టుబడులు, ఎపి ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాల కోసం ఈ పోర్టల్ ఉపకరిస్తుంది. ఎపిలో నిరుద్యోగ యువతలో వ్యాపార నైపుణ్యాన్ని వెలికితీసి యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసే లక్ష్యంతో ఈ పోర్టల్ పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం పోర్టల్‌లో వ్యాపార సంబంధమైన అన్నీరకాల అంశాలను పొందుపరిచామని, ఇతర సంస్థలతో కలిసి దీని పరిధిని మరింత విస్తృతపరిచేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఎపిలో నూతన పెట్టుబడులు రావడమే కాకుండా పెట్టుబడిదారులు ఇతర సంస్థలకు మధ్య సంబంధాలు ఏర్పడుతాయని వారు చెప్పారు.