ASBL Koncept Ambience

ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం, కేంద్ర మంత్రి

ఏపీ  పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం, కేంద్ర మంత్రి

పారిశ్రామిక రంగంలో రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా ఏపీ పెవిలియన్‌ లో స్టాళ్లను ఏర్పాటు  చేశారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌ తొలిరోజు పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, మహిళా సంఘాలు, హస్తకళాకారుల ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు. పారిశ్రామిక ప్రభుత్వ వాణిజ్య సంస్థలు 137 స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించారు. వివిధ స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించి, వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. శ్రీసిటీలో తయారు చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాహనాలు, ఇతర ఉత్పత్తులను ఆ స్టాల్‌లో ప్రదర్శించారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌లో హస్తకళలు, పర్యాటక ప్రదేశాల విశేషాలను తెలియజేసేలా నమూనాలు  ఉంచారు. ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ వంటి సంస్థలూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సెంచూరియన్‌ వర్సిటీ విద్యాసంస్థలు, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తయారు చేసిన సైనిక హెలికాప్టర్లు, తేజస్‌ యుద్ధ విమానం నమూనాలు, ఇతర సైనిక ఉత్పత్తులను ప్రదర్శించారు.

 

 

Tags :