ASBL Koncept Ambience

ఆటా కాన్ఫరెన్స్ లో ఆంధ్ర నాయకులు

ఆటా కాన్ఫరెన్స్ లో ఆంధ్ర నాయకులు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న 17వ ఆటా మహాసభల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పలువురు రాజకీయ నాయకులు వస్తున్నారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ముందుగా సంసిద్ధతను వ్యక్తపరిచినప్పటికీ వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న కారణంగా వారు హాజరుకాలేకపోతు న్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్‌లు, ప్రభుత్వ ప్రతినిధులు, ఇతరులు ఈ కాన్ఫరెన్స్‌కు వస్తున్నారు. ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యేలు కూడా ఈ వేడుకకు తరలి వస్తున్నారు.

 తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ వై.వి. సుబ్బారెడ్డి, ఎంపి మాగంటి భరత్‌ రామ్‌, ఎమ్మెల్యేలు శిల్పా మోహన్‌ రెడ్డి, వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఎపి టూరిజం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ అరిమంద వరప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యా వుల కేశవ్‌, గంటా శ్రీనివాసరావు అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న రత్నాకర్‌ పండుగా యల, ఎపిఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ వెంకట్‌ మేడపాటి, ఎపి దేవాదాయశాఖ ఎన్నారై విభాగం సలహాదారు వేంకట సుబ్బారావు చెన్నూరి తదితరులు పాల్గొంటున్నారు.

 

Tags :