ASBL Koncept Ambience

కోడెల అమెరికా పర్యటన షెడ్యూల్ ఇదే!

కోడెల అమెరికా పర్యటన షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అమెరికాలో పర్యటనకు వెళ్తున్నారు. జన్మభూమి కార్యక్రమం కింద నవ్యాంధ్రలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఆయన పర్యటిస్తున్నారు. 28న షార్లెట్‌, 29న ఫీనిక్స్‌, 30న డల్లాస్‌, 31న హ్యూస్టన్‌ , ఆగస్టు 2,3 తేదీల్లో డెట్రాయిట్‌, 4, 5 తేదీల్లో న్యూజెర్సీ, న్యూయార్క్‌, 6, 7 తేదీల్లో సిలికాన్‌ వ్యాలీలో ప్రవాసాంధ్రుల సదస్సులో స్పీకర్‌ కోడెల ప్రసంగిస్తారని అమెరికాలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి కోమటి జయరాం వెల్లడించారు. అలాగే  ఆగస్టు 8 నుంచి చికాగోలో జరిగే అంతర్జాతీయ శాసనసభ్యుల సమావేశంలో  స్పీకర్‌ కోడెల పాల్గొంటారు.

 

Tags :