ASBL Koncept Ambience

బే ఏరియా స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో కోడెల శివప్రసాదరావు

బే ఏరియా స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో కోడెల శివప్రసాదరావు

బే ఏరియాలో ఇండో అమెరికన్‌ అసోసియేషన్‌ నిర్వహించిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎపి అసెంబ్లీ స్పీకర్‌ డా. కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత దేశ వైభవాన్ని అమెరికాలో ఎన్నారైలు పెద్దఎత్తున చాటేలా ఇలాంటి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. స్వదేశీమేళా పేరుతో ఈ వేడుకలను ఇండో అమెరికన్స్‌ అసోసియేషన్‌ మిల్‌పిటాస్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో నిర్వహించింది. ఈ వేడుకల్లో 29 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తమ రాష్ట్ర సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాళ్ళను కోడెల చూశారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సులేట్‌ జనరల్‌ అశోక్‌ వెంకటేశన్‌, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, శాన్‌హోజె మేయర్‌ హోసె, కుపర్టినో డిప్యూటీ మేయర్‌ సబితలతోపాటు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నాయకులు, బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) నాయకులు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విజయ ఆసూరి, ప్రసాద్‌ మంగిన, శిరీష బత్తుల, వీరు ఉప్పల, వెంకట్‌ కోగంటి, రజనీకాంత్‌, కళ్యాణ్‌ కట్టమూరి తదితరులు కూడా ఈ వేడుకలకు హాజరైనవారిలో ఉన్నారు. 


 

Tags :