ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్నారైలూ.. కలసిరండి!
ప్రతి ఒక్క ప్రవాసాంధ్రుడు రాష్ట్రం కోసం ఎంతో కొంత చేయవచ్చని, సేవ ఆర్థికపరమైనదే కావాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. అమెరికాలోని మిల్పిటాస్‌లో ఎన్‌ఆర్‌ఐ తెలుగు సంఘాలు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడెల మాట్లాడుతూ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాకపోవడం ఆందోళనకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం సమస్యలను అధిగమించి పురోగమనంలో ముందుకు వెళ్లగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోడెల పిలుపునకు స్పందించిన పలువురు ప్రవాసులు డిజిటల్ క్లాస్ రామ్ కార్యాక్రమానికి చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, తానా-బాటా ప్రతినిధులు సతీష్ వేమూరి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మిల్పిటాస్ స్వాతంత్య్ర వేడులకు కోడెల
అమెరికాలోకి మిల్పిటాస్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెలశివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 కోట్ల మంది ప్రవాసులు దేశం వెలుపల భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారత కాన్సుల్ జనరల్ అశోక్, వెంకటేష్, ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కోమటి జయరాం పాల్గొన్నారు.