ASBL Koncept Ambience

అపర్ణా నుంచి బొటిక్ మాల్స్

అపర్ణా నుంచి బొటిక్ మాల్స్

రియల్‌ ఎస్టేట్‌రంగంలో టాప్‌ కంపెనీల్లో ఒకటిగా ఉన్న అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. తనదైనశైలిలో నిర్మాణరంగంలో దూసుకుపోతున్న అపర్ణా సంస్థ ఇప్పుడు ద్వితీయ, తృతీయ నగరాల్లో షాపింగ్‌ మాల్స్‌, మల్టీప్లెక్స్‌ కాన్సెప్ట్‌లను పరిచయం చేస్తున్నది. ఈ మాల్స్‌ ప్రధాన నగరాల్లో మాదిరిగా పెద్దగా కాకుండా చిన్నగా (బొటిక్‌) స్థాయిలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

శంషాబాద్‌లో తొలి బొటిక్‌ మాల్‌ను ప్రారంభించనుంది. ఆ తర్వాత వరంగల్‌, కరీంనగర్‌, తిరుపతి, రాజమండ్రి వంటి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ద్వితీయ, తతీయ శ్రేణి పట్టణాల్లో ఈ బొటిక్‌మాల్‌ను నిర్మించనుంది. రాజమండ్రి, వరంగల్‌లో స్థలాల అన్వేషణ పూర్తయింది. అభివద్ధి పనులను ప్రారంభించాల్సి ఉందని కంపెనీ చెబుతోంది. వచ్చే 5  ఏళ్లలో కోటిన్నర చ.అ.ల్లో, సుమారు 6 నుంచి 10 బొటిక్‌ మాల్స్‌ను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ బొటిక్‌మాల్స్‌లో ఫుడ్‌ కోర్ట్‌, మల్టీప్లెక్స్‌, షాపింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్‌, కిడ్స్‌ ప్లేజోన్‌ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రస్తుతం అపర్ణా సంస్థ నల్లగండ్లలోని అపర్ణా సరోవర్‌ జెనిత్‌ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో 3.5 లక్షల చ.అ. రిటైల్‌ మాల్‌ను కూడా ఏర్పాటు చేస్తోంది.

3.3 ఎకరాల్లో అపర్ణా మాప్లే

బెంగళూరులో సరికొత్త ప్రాజెక్ట్‌ను అపర్ణా సంస్థ ప్రారంభించింది. హోబ్లీలోని కేఆర్‌ పురం దగ్గర్లో అపర్ణా మాప్లే పేరిట గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను లాంచింగ్‌ చేసింది. 3.3 ఎకరాల్లో సుమారు 246 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. రెండు టవర్లు.. ఒక్కోటి 14 అంతస్తుల్లో ఉంటుంది. 1,165 చ.అ నుంచి 1,590 చ.అ. మధ్య ఫ్లాట్‌ కార్పెట్‌ ఏరియా ఉంటుంది.  కమర్షియల్‌ హబ్స్‌, ఎయిర్‌పోర్ట్‌, ఓఆర్‌ఆర్‌, సెంట్రల్‌ బెంగళూరు వంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఇక్కడ నుంచి సులువుగా ఉంటుందని'' కంపెనీ డైరెక్టర్‌ రాకేష్‌ రెడ్డి తెలిపారు. 2022 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెబుతున్నారు.

www.aparnaconstructions.com

 

Tags :