కొండాపూర్‌లో అపర్ణా ‘లగ్జర్ పార్క్'
అపర్ణా సంస్థ కొండాపూర్‌లో ‘లగ్జర్ పార్క్' అనే హై ఎండ్ లగ్జరీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. బడా ఫ్లాట్లలో నివసించాలని భావించేవారికిదో చక్కటి ఆప్షన్ అని సంస్థ అంటున్నది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో వచ్చేవి 414 ఫ్లాట్లు. మొత్తం నాలుగు టవర్లను నిర్మిస్తున్నది. ఒక్కో టవర్‌ను సుమారు ఇరవై అంతస్తుల ఎత్తులో ఉండేలా డిజైన్ చేసింది. ఇందులో వచ్చేవన్నీ మూడు, నాలుగు పడక గదుల ఫ్లాట్లే. ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం సుమారు 2,025 నుంచి 3,165 చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు. కాస్త బడా సైజులో, లగ్జరీ సదుపాయాల్ని ఆస్వాదించాలని కోరుకునేవారికి ఇది చక్కటి ప్రాజెక్టు అని అపర్ణా సంస్థ చెబుతున్నది. ప్రతి ఫ్లాటును వాస్తు సూత్రాలకు అనుగుణంగా డిజైన్ చేసింది.
లగ్జర్ పార్కులో నివసించేవారికి అత్యుత్తమ ఆధునిక సదుపాయాల్ని అందించేందుకు అపర్ణా సంస్థ ఏకంగా 43 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో లభించని సదుపాయమంటూ లేదు. టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. కిడ్స్ పూల్, జిమ్, ప్రీవ్యూ థియేటర్, హాబీ రూమ్, స్పా, సెలూన్, క్రెష్, రీడింగ్ లాంజ్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇండోర్ ఆటల్ని ప్రోత్సహించడానికి పలు సౌకర్యాల్ని పొందుపర్చింది. రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, స్క్వాష్ కోర్టు, రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ వంటివి అభివృద్ధి చేస్తున్నది. టెన్నిస్, బాస్కెట్ బాల్ కోర్టులు, క్రికెట్ నెట్, కిడ్స్ ప్లే కోర్టు వంటివి ఏర్పాటు చేస్తున్నది.