ASBL Koncept Ambience

లోకేష్‌కు స్వాగతం పలికిన ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులు

లోకేష్‌కు స్వాగతం పలికిన ఏపీఎన్‌ఆర్టీ ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క విదేశీ పర్యటనలు చేసి పలు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. వారిని ఆకట్టుకుంటున్నారు. వసతి, సౌకర్యాలతో పాటు, రాయితీలను ఇస్తున్నారు. ఫలితంగా పెట్టుబడుల వరద పారుతోంది. వందల, వేల ఉద్యోగాలు వస్తున్నారు. ఇపుడు ఆయన తనయకుడు లోకేష్‌ అదే బాట పట్టారు. 2 రోజుల టూర్‌ కోసం అమెరికాలోని శాన్‌ ప్రాన్సిస్కో నగరంలో అడుగు పెట్టారు మంత్రి నారా లోకేష్‌. ఎయిర్‌ పోర్ట్‌ లోనే ఏపీ ఎన్‌ఆర్టీ ప్రతినిధులు ఆయనకు  ఘన స్వాతం పలికారు.

మంత్రి పదవి చేపట్టిన 90 రోజుల్లోనే 3వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించారు మంత్రి లోకేష్‌. పలు కంపెనీలు ఏపీలో ప్రారంభించడం వల్ల ఉపాది, ఉద్యోగ అవకావాలు మెరుగుపడుతున్నాయి. చిన్న సంస్థలను ప్రోత్సహించడం వల్ల పెద్ద కంపెనీలుగా మారుతున్నాయి. ప్రపంచంలో ఏ కంపెనీలో చూసిన అధిక శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతే ఉంటున్నారు. ప్రపంచంలోని ప్రతి పది మంది ఐటీ నిపుణులలో నలుగురు భారతీయులే. వారిలో తెలుగు వారు ఉన్నారన్నది వాస్తవం. ప్రపంచంలో ఉన్న ఐటీ నిపుణులలో పది శాతం మంది తెలుగువారు అయ్యేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునే కారణం. నాలుగు లక్షల మంది తెలుగు ఐటీ నిపుణులు ఒక వేదికపైకి వస్తే ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు ఏపీ ఎన్‌ ఆర్టీ అదే పని చేస్తోంది. అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది సాహసంతో కూడిన పనే. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఐటీ సాంకేతికతను వినియోగించేందుకు ఏపీ ఎన్‌ ఆర్టీ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన వారిలో ఏపీ ఎన్‌ ఆర్టీ ప్రతినిధులు సాగర్‌ దొడ్డపనేని, స్నేహ వీదుల, అబ్దుల్‌ ఖుద్దూస్‌, భక్త బల్లా తదితరులు ఉన్నారు.

Tags :